
గాంధీజీ సూక్తులను ఆలపిస్తున్న విద్యార్థులు
కాజీపేట అర్బన్: హన్మకొండ హంటర్‌రోడ్డులోని నవయుగ హైస్కూల్ విద్యార్థులు తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించి చరిత్ర సృష్టించారు. పలికారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు వినూత్నంగా స్పందించారు. పాఠశాలకు చెందిన 184 మంది విద్యార్థులు గాంధీజీ వేషధారణలో మహాత్ముడి నివాళులర్పిస్తూ 184 సూక్తులను ఆలపించారు.
దీంతో తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికారŠుడ్సలో ప్రతి విద్యార్థి పేరును నమోదు చేశారు. అనంతరం విద్యార్థులు అలకనంద గార్డెన్స్ నుంచి బయలుదేరి పబ్లిక్ గార్డెన్ లోని గాంధీజీ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి జెడ్పీ వరకు భారీ ర్యాలీతో నిర్వహించారు.
కరస్పాండెంట్ లింగారెడ్డి ఆధ్వర్యంలో..
‘నవయుగ’ కరస్పాండెంట్ గోపు లింగారెడ్డి ఆధ్వర్యంలో హంటర్‌రోడ్డులోని అలకనంద గార్డెన్స్ వేదికగా విద్యార్థులు ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరంగల్ కోఆర్డినేటర్ సీతం రఘువేందర్, యూత్ వింగ్ ఇన్‌చార్జి గంగారపు అఖిల్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి రికార్డుæను ఆమోదించారు.గాంధీజీ మార్గం అనుసరణీయం: ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌గాంధీజీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు ముందుకు సాగాలని వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
విద్యార్థుల స్ఫూర్తి అభినందనీయం అన్నారు. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓరగుల్లుకు స్థానం కల్పించిన నవయుగ స్కూల్ విద్యార్థులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, రచయిత అంపశయ్య నవీన్, గంగాపురం అఖిల్, సీతల రఘువేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది..
తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మా విద్యార్థులు చోటు సాధించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో లిమ్కా, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించేందుకు కృషి చేస్తాం. విద్యార్థులను నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి తీర్చిదిద్దాం. కష్టానికి ఫలితం దక్కింది.. సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.
– గోపు లింగారెడ్డి , కరస్పాండెంట్, నవయుగ హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment