హన్మకొండ కల్చరల్: విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తోందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హర గోపాల్ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొం డలో ‘కలాలు ఎదుర్కొంటున్న సవాళ్ల’ అనే అంశంపై జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. తాను రచయితను అయినప్పటికీ కంచ ఐలయ్య రచనలపై జరిగిన దాడుల మాదిరిగా తనపై జరగ లేదని, ఐలయ్య రచనలు అంతగా ప్రభా వితం చేశాయ న్నారు. తెరవే రాష్ట్ర అధ్య క్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ వేదిక ప్రజల పక్షాన నిలబ డుతుందని శ్రమజీవుల మధ్య ఉంటూ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో రచయిత అల్లం రాజయ్య, ఆచార్య కాత్యాయనీ విద్మహే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment