సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వచ్చిన తర్వాత ఏ వస్తువుకు ఎంత పన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపారి ఎంత అంటే అంత జీఎస్టీని చెల్లించేవారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా జీఎస్టీ వేయడంతో వినియోగదారులు మోసపోతుండటంతో కేంద్రం జీఎస్టీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు ఇష్టారా జ్యంగా చెప్పే జీఎస్టీలకు వినియోగదారులు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల డివిజన్లు ఉండగా.. అందులో జీఎస్టీ డీలర్లు 1,63,059 ఉన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతి వస్తువు పన్నుపైనా స్పష్టత వచ్చేలా ఈ యాప్‌ను రూపొందించారు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువు ధర, పన్నుల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీలలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోని వస్తువుల ఐచ్ఛికాన్ని ఎంచుకున్న వెంటనే తెరపై 0,3,5,12, 18,25,28 శాతం తదితర పన్నుల జాబితా కనిపిస్తుంది. దీని ద్వారా ఏయే వస్తువులకు ఎంత శాతం పన్ను విధించారో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వస్తుసేవలు 5% అంశంపై నొక్కగానే ఆ పన్ను చెల్లించాల్సిన సరుకుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.
సేవల వివరాలు..
ప్రభుత్వం కల్పించే సేవలకు విధించిన పన్ను వివరాలను ఐచ్ఛికం ద్వారా తెలుసుకునే అవకాశముంటుంది. మొబైల్‌లో అంశాన్ని ఎంచుకుంటే తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి. యాప్‌లో సమాచారం అనే అంశం ప్రెస్ చేయగానే జీఎస్టీకి సంబంధించిన వివరాలు లభిస్తాయి. జీఎస్టీ ఎందుకు అమలులోకి తెచ్చారు, దీనివల్ల కలిగే ప్రభావం, ప్రయోజనాలు, పర్యవసనాలు తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయి.
డౌన్‌లోడ్ చేసుకోండిలా...
గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి మొదట జీఎస్టీ రేట్ ఫైండర్ అని టైప్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. వెంటనే మొబైల్ తెరపై పలు యాప్‌లు కనిపిస్తాయి. వీటిలో జీఎస్టీ రేట్ ఫైండర్ ఇంగ్లిష్, హిందీ ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అవగానే స్క్రీన్‌పై వస్తువులు, పన్నులు, సేవలు, సమాచారం తదితర వివరాలతో నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుంటే తగిన సమాచారాన్ని పొందవచ్చు.
అరచేతిలో జీఎస్టీ!
Published Wed, Mar 21 2018 2:58 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment