![Professor Haragopal about UGC Cancellation - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/10/HARAGOPAL-10.jpg.webp?itok=hwpUMou-)
హైదరాబాద్: యూజీసీ రద్దు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ‘యూజీసీ రద్దు–ఉన్నత విద్య విధ్వంసం’ అనే అంశంపై సదస్సు జరిగింది. పీడీఎస్‌యూ ఓయూ అధ్యక్షుడు లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విద్యను కాషాయీకరణ చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాము పాల్గొన్నారు.
యూజీసీ స్కేల్ అమలుపై అధ్యయనానికి కమిటీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అర్హత కలిగిన బోధనాసిబ్బందికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సవరించిన ఏడో వేతన కమిషన్ వేతనాలను చెల్లించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీలో ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఓయూ మాజీ వీసీ, జేఎన్‌టీయూ, మçహాత్మాగాంధీ వర్సిటీ వీసీలు, కళాశాల విద్యా కమిషనర్‌ను సభ్యులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment