ఒంటిపూట బడి వేళలివే! | half day schools start from 15th march | Sakshi
Sakshi News home page

ఒంటిపూట బడి వేళలివే!

Published Sun, Mar 12 2017 5:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఒంటిపూట బడి వేళలివే! - Sakshi

ఒంటిపూట బడి వేళలివే!

ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు..
సాక్షి, హైదరాబాద్‌: ఒంటిపూట బడుల వేళలను నిర్ధారించే విషయమై పాఠశాల విద్యాశాఖ కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎండలు పెరిగిన దృష్ట్యా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 10 నుంచి 10.20 గంటల వరకు విరామం, మిగిలిన సమయంలో మొత్తం ఆరు పీరియడ్‌లు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement