
మాది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం
కాటేపల్లి విజయంతో అది రుజువైంది: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి రుజువైందని, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడమే దీనికి తాజా ఉదాహరణ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాటేపల్లిని ఎమ్మెల్సీగా గెలిపించు కోవడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఉపాధ్యాయుల నమ్మకాన్ని తప్పక నిలబెట్టు కుంటామని హామీ ఇచ్చారు. ఏకీ కృత సర్వీస్ సమస్య కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, తమ ఎంపీలు ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్ని స్తున్నారని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ రద్దు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచిందన్నారు.