పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమవుతున్న ప్యాకేజీ–6 మేడారం అండర్ టన్నెల్ వద్ద భూగర్భంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద అండర్ టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. విద్యుత్ కేంద్ర పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.450 కోట్లతో 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన విద్యుత్ కేంద్రాన్ని నెల రోజుల్లోనే ఏర్పాటు చేయడం సరికొత్త రికార్డు అని చెప్పారు. భూమిపైన ఇలాంటి విద్యుత్ కేం ద్రాన్ని నిర్మించేందుకు 65 ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. భూగర్భంలో కేవలం ఎకరం స్థలంలోనే విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరో రికార్డుగా పేర్కొన్నారు. 400 మెగావాట్ల గ్యాస్ విద్యుత్‌తో ఏడు పంపులకు సరిపడా కరెంటు సరఫరా అవుతుందన్నారు. త్వరలోనే మేడారం ప్రాజెక్టుకు 1.2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్ల, మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్, బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు కాళేశ్వరం వైపు చూస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా కోటి ఎకరాల బంగారు పంటల లక్ష్యానికి చేరువవుతామన్నారు. ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం దేశానికే గర్వ కారణంగా నిలుస్తుందన్నారు. ప్రాజె క్టు నిర్మాణంతోపాటు అండర్ గ్రౌండ్ లో గ్యాస్ ఇన్‌స్టాలేషన్ విద్యుత్ ఉత్పత్తిని సవాల్‌గా తీసుకొని నెల రోజుల్లోనే పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment