
సాక్షి, సిద్దిపేట : సోషల్‌మీడియా మోజులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. సిద్దిపేటలోని బద్ధిపడగ తండాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను హరీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేపట్టారని తెలిపారు. నిరుపేద ప్రజలకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తుంది. ఇన్నాళ్లుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న బద్ధిపడగ తండా వాసులు నేటి నుంచి ఆత్మ గౌరవంతో జీవిస్తారు. అలాగే పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment