సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు.
అలాగే ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. రూ.461 కోట్ల పనులతో 10 టీఎంసీల నీటినిల్వ కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఐదున్నర టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉందన్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో 18 మండలాలకు మిడ్‌మానేరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరు అందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment