స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ వేతనం పెంచాలంటూ డిమాండు చేస్తున్న ప్రజాప్రతినిధులు సీఎం నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం పెంపుదలతో సరిపెట్టకుండా స్థానిక సంస్థలకు రాజ్యాంగంలో పేర్కొన్న 29 అధికారాలను సంపూర్ణంగా బదలాయించాలని కోరుకుంటున్నారు. వేతన పెంపుతో స్థానిక సంస్థ పాలనలో పారదర్శకతతో కూడిన అవినీతిరహిత పాలన సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచాలనే డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి భారీ సానుకూలత దక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్ వేతనం రూ.7,500నుంచి లక్ష రూపాయలకు పెంచడం అనూహ్య పరిణామం. కాగా జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ చైర్మన్లు మొదలుకుని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకూ భారీగా వేతనాలు పెరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో భాగంగా వేతనాలు పెంచాలంటూ చాలా ఏళ్లుగా సర్పంచ్‌లు డిమాండ్లు వినిపిస్తున్నారు. స్థానికసంస్థల సమస్యలపై గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. మరుసటి రోజే వేతనాల పెంపు ప్రకటన రావడంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో స్థానికసంస్థల్లో పారదర్శకతతో పాటు బాధ్యత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అవినీతి రహిత పాలన అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందనే భావన నెలకొంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, వివిధవర్గాలకు రిజర్వేషన్ల మూలంగా నిరుపేద కుటుంబాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. అయితే కనీస అవసరాలు తీర్చేలా గౌరవ వేతనం లేకపోవడంతో ఆర్థిక భారంతో ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానిక సంస్థలపై మరిన్ని వరాలు..
స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 29 అంశాలను తమకు అప్పగించాలంటూ స్థానికసంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పంచాయతీరాజ్ కమిషనర్ నివేదిక ఆధారంగా అధికారాలు బదలాయిస్తామని ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. ట్రాన్స్‌కోకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల వసూలు నిలుపుదలపైనా ప్రభుత్వం ఇటీవల సానుకూలంగా స్పందించింది. సర్పంచ్‌లకు ఇటీవలి కాలంలో చెక్‌పవర్ సంపూర్ణంగా బదిలీ చేయాలని కోర్టు కూడా ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్థానికసంస్థలు మరిం త బలోపేతమవుతాయని పాలకులు భావిస్తున్నారు. వేతనాలు పెంచిన రీతి లోనే జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 108 పంచాయతీలకు ప్రోత్సాహకాలు విడుదల చేయాలనే డిమాండు వినిపిస్తోంది. గౌరవ వేతన లబ్ధిదారుల జాబితాలో తమ ప్రస్తావన లేకపోవడంపై పంచాయతీ వార్డు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకూ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
జెడ్పీ చైర్మన్ల వే తనాన్ని రూ.లక్షకు పెంచిన సీఎంకు రు ణపడి ఉంటాం. గౌ రవ వేతం పెంచాల ని జిల్లా పరిషత్ చైర్మన్ల కోరుతున్నాం కా నీ.. ఇంత పెద్ద మొత్తంలో వేతనం పెం చుతారనుకోలేదు. జెడ్పీ చైర్మన్లకు మా త్రమే కాకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు కూడా గౌర వ వేతనాలు పెంచడం అభినందనీ యం. తెలంగాణ రాష్ట్రంలో మా కల సకారమైంది. బంగారు తెలంగాణ కోసం కృ షి చేస్తున్న కేసీఆర్‌కు అండగా ఉంటాం.
- బండారి భాస్కర్, జెడ్పీ చైర్మన్
బంగారు తెలంగాణ దిశగా..
ప్రభుత్వ పథకాలను పార దర్శకంగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. వేతనాల పెంపుతో పాటు అధికారాల బదలాయింపుతో వికేంద్రీకృత పాలన సాధ్యమవుతుంది. వేతనాల పెంపు ద్వారా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల్లో సీఎం కేసీఆర్ ఆత్మ విశ్వాసం నింపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాం.
- పురుషోత్తం రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు
భారీ నజరానా
Published Sat, Mar 14 2015 1:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement