
గాలివాన బీభత్సంతో భారీగా నష్టం
కమలాపూర్ మండలం పరిధిలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
కమలాపూర్ (కరీంనగర్ జిల్లా) : కమలాపూర్ మండలం పరిధిలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కమలాపూర్, కనిపర్తి, గూడూర్, అంబాలా, నేరెళ్ల, శ్రీరాములపల్లి, గునిపర్తి, మాదన్నపేటతోపాటు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో రాత్రి నుంచి అంధకారం నెలకొంది. గాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, మామిడి, సపోట నేలరాలాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టారు.