ఆసిఫాబాద్‌లో భారీ వర్షం
- ఇళ్లలోకి చేరిన నీరు
- స్తంభించిన జనజీవనం
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటలపాటు కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. బజార్‌వాడి, పైకాజినగర్, మార్కండేయ కాలనీ, చెక్‌పోస్ట్, కంఠ కాలనీ, తారకరామానగర్ కాలనీలో జలమయం అయ్యూయి. మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. పైకాజీనగర్‌కు చెందిన పూసాల శంకర్, బట్టుపెల్లి విలాస్, రంగ సుభాష్ ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
నిత్యావసర వస్తువులు, ఫ్రిజ్, కూలర్ తడిసిపోయూరుు. వివేకానంద చౌక్‌లోని వేప చెట్టు వర్షంతో నేలకొరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని పలువురి ఇళ్లు జలమయం అయ్యాయి. సర్పంచ్ మర్సకోల సరస్వతి కాలనీల్లో పర్యటించారు. మార్కండేయ కాలనీలో వర్షం నీరు వెళ్లేలా ప్రొక్లయినర్‌తో చర్యలు చేపట్టారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోందని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు.
జిల్లాలో 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 15.4 మిల్లీమీటర్ల సగ టు వర్షపాతం నమోదైంది. 35 మండలాల్లో ఓ మో స్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జైనథ్ మండలం లో 92.2 మిల్లీమీటర్లు, బజార్‌హత్నూర్‌లో 60.0, తలమడుగులో 57.4, నిర్మల్‌లో 49.0, సిర్పూర్(టీ) లో 43.4, ఇంద్రవెల్లిలో 40.6, గుడిహత్నూర్‌లో 39.0, లక్ష్మణచాందలో 32.2, భీమినిలో 26.8, ఖా నాపూర్‌లో 25.8, దహెగాంలో 24.6, దిలావర్ పూర్ లో 22.2, తానూర్‌లో 20.6, భైంసాలో 19.0, సిర్పూర్(యూ)లో 19.0, కౌటాలలో 16.4, తాంసిలో 16.4, నేరడిగొండలో 16.2, సారంగాపూర్‌లో 16.2, జన్నారంలో 14.8, కాగజ్‌నగర్‌లో 13.2, బేలలో 11.4, ఆదిలాబాద్‌లో 8.4, ఆసిఫాబాద్‌లో 8.4, దం డేపల్లిలో 8.2, జైనూర్‌లో 8.0, కుభీర్‌లో 7.2, మామడలో 7.4, బోథ్‌లో 7.2, కాసిపేటలో 7.2, కుంటాలలో 6.8, ఇచ్చోడలో 6.4, కెరమెరిలో 5.4, మందమర్రి మండలంలో 5.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 625.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 508.2 మిల్లీమీటర్లు పడింది. 19శాతం లోటు వర్షపాతంగా ఉంది.