inundation
-
వర్షం ఇంక లేదు.. వరదైంది..!
చైనా వరద బీభత్సంతో అల్లాడిపోతోంది. నగరాలు నదుల్లా మారిపోయాయి. వరద ముంపుని ఎదుర్కోవడానికి చైనా కొన్నేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన స్పాంజ్ సిటీస్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదల్ని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు 30 నగరాలను స్పాంజ్ నగరాలుగా మార్చింది. మరి ఈ స్పాంజ్ సిటీస్ సమర్థంగా పని చేయడం లేదా ? ఈ ఏడాది చైనాలో ఎందుకీ వరద బీభత్సం? వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, వరదలు లేదంటే రికార్డు స్థాయి ఎండలు, ఉక్కబోత.. ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయి వర్షాలతో చైనా తడిసి ముద్దవుతోంది. కేవలం జులై నెలలో కురిసిన వర్షాలకే 150 మంది మరణిస్తే, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 250 కోట్ల డాలర్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదల్ని ఎదుర్కోవడం కోసమే చైనా కొన్నేళ్ల క్రితం స్పాంజ్ సిటీల నిర్మాణానికి నడుం బిగించింది. ఏమిటీ స్పాంజ్ సిటీస్ వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అంచనా వేసిన చైనా 2015లో స్పాంజ్ సిటీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చైనాలో 654 నగరాల్లో 641 నగరాలకి వరద ముప్పు పొంచి ఉంది. ప్రతీ ఏడాది 180 పట్టణాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జనాభాతో కిటకిటలాడుతూ ప్రతీ నగరం ఒక కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్షపు నీరు నగరాన్ని ముంచేయకుండా బొట్టు బొట్టు సద్వినియోగం చేసుకోవడమే ఈ స్పాంజ్ సిటీస్ లక్ష్యం. ఏ ప్రాంతంలో కురిసిన వాన నీరు అదే ప్రాంతంలో పూర్తిగా వాడుకునేలా సహజసిద్ధమైన ఏర్పాట్లు చేయడం స్పాంజ్ సిటీస్. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షపు నీటిని ఒక స్పాంజ్‌లా పీల్చుకునేలా నగరాల రూపురేఖలు మార్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ఎంతవరకు అమలైంది? చైనా ఈ ప్రాజెక్టుని అత్యంత ఘనంగా ప్రకటించింది కానీ ఆచరణలో ఇంకా వేగం పుంజుకోలేదు. 2015లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టి 30 నగరాలను స్పాంజ్ సిటీలుగా మార్చింది. ఒక్కో నగరం మీద వెయ్యి కోట్ల యువాన్లకు పైనే ఖర్చు పెట్టింది. గత ఏడాది మొత్తం 654 నగరాలకు గాను 64 నగరాలకు స్పాంజ్ సిటీ మార్గదర్శకాలు పాటించాలని నిబంధనలు విధించారు. 1978 నుంచి గణాంకాలను పరిశీలిస్తే చైనా పట్టణ ప్రాంత జనాభా అయిదు రెట్లు పెరిగింది. చైనా జనాభాలో 90 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఉత్తర చైనా మినహాయించి మిగిలిన పట్టణ ప్రాంత జనాభా అంతా వరద ముప్పులో ఉంది. అందుకే స్పాంజ్ సిటీస్ నిర్మాణం వేగవంతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పాంజ్ సిటీస్ పై ఒక చట్టాన్ని తీసుకువస్తేనే త్వరితగతిన వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పాంజ్ సిటీల నిర్మాణం ఇలా! ► నగరంలో రెయిన్ గార్డ్స్ నిర్మాణం ► వర్షం నీరు రహదారులపై నిలవకుండా నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా రహదారుల నిర్మాణం ► రోడ్డుకిరువైపు పేవ్మెంట్ల మీద, ప్రతీ భవనంలోనూ వాన నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాటు ► నీరు నిల్వ చేయడానికి కొత్తగా కాలువలు, చెరువుల తవ్వకం ► వాన నీరు రిజర్వాయర్లలోకి వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం ► చిత్తడి నేలల పునరుద్ధరణ ► ప్రతీ భవనంపైనా రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు ► వర్షం నీరుని శుద్ధి చేస్తూ తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడేలా ఎక్కడికక్కడ ప్లాంట్ల నిర్మాణం స్పాంజ్ సిటీలకూ పరిమితులున్నాయ్..! చైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీలను నిర్మించినప్పటికీ ఈ ఏడాది వరద బీభత్సాన్ని ఎదుర్కోవడం సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జూ నగరాన్ని పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీగా మార్చేసింది. 2016 నుంచి 2021 మధ్య కేవలం ఈ ఒక్క నగరంపైనే 6 వేల కోట్ల యువాన్లు ఖర్చు పెట్టింది. అయినప్పటికీ వరదల్ని ఎదుర్కోలేక జెంగ్జూ నగరం నీట మునిగింది. దీనికీ కారణాలన్నాయి. చైనా తలపెట్టిన స్పాంజ్ సిటీలు రోజుకి 20 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే తట్టుకోగలవు. అలాంటిది గత జులైలో జెంగ్జూలో ఒక గంటలో 20 సెంటీ మీటర్ల వాన కురిసింది. ఇక బీజింగ్ పరిసరాల్లో మూడు రోజుల్లో 75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఉత్తర చైనాలో సాధారణంగా వర్షలు అంతగా కురవవు. అందుకే ఆ ప్రాంతంలో ఇంకా స్పాంజ్ సిటీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.. ఈ ఏడాది వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర చైనాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అక్కడ స్పాంజ్ సిటీల నిర్మాణం జరగకపోవడంతో వరదలు పోటెత్తాయి. చైనా ఎన్ని చర్యలు చేపట్టి కోట్లాది యువాన్లు ఖర్చు చేసినా ప్రకృతి ముందు తలవంచక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్‌పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
పోలవరం ముంపు జాబితాలోకి మరో 36 గ్రామాలు
వేలేరుపాడు (ఏలూరు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్ ముంపు కాంటూర్ లెవల్స్‌తో సంబంధం లేకుండా గత ఏడాది వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో 36 గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 20,946 మంది నిర్వాసితులు ఉండగా.. కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు సంబంధించిన మరో 13,937 మంది నిర్వాసితులను చేర్చనున్నారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 34,883కు పెరుగుతోంది. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్తగా చేరిన గ్రామాలివీ కొత్త జాబితాలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, తూర్పుమెట్ట, టేకూరు, కాకినూరు, కాచారం, ఎర్రమెట్ట, ఎడవల్లి, టేకుపల్లి గ్రామాల్లో 901 మంది నిర్వాసితులను జాబితాలో చేరనున్నాయి. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, చీరవల్లి మాధవరం, బెస్తగూడెం, ఆంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, రావిగూడెం, ఎల్లప్పగూడెం, ఎర్రబోరు, గుడంబోరు, ముత్యాలంపాడు గ్రామాల్లో 2,123 మంది కొత్త నిర్వాసితులు చేరతారు. చింతూరు మండలంలోని చింతూరు, రామవరంపాడు, ప్రతిపాక, గుండుగూడెం, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలంలోని వీఆర్‌పురం, ధర్మతాళ్లగూడెం, రాజ్పేటకాలనీ, ఎ.వెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కూనవరం మండలంలోని టేకుబాక, కూనవరం, టేకులబోరు, కొడ్రాజుపేట, పెద్దార్కూరు, పండురాజుపల్లి, శబరికొత్తగూడెం తదితర గ్రామాలను కొత్త జాబితాలో చేరుస్తున్నారు. కాంటూర్ లెవల్స్‌తో సంబంధం లేదు కొత్త జాబితాలో చేర్చే గ్రామాలకు, పోలవరం ప్రాజెక్ట్ కాంటూర్ లెవల్స్‌కు సంబంధం లేదు. ఏటా వచ్చే వరదలకు వల్ల నిర్వాసితులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెండు జిల్లాల్లో 36 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రారంభించాం. మొదటి ప్రాధాన్యతగా ఆర్ అండ్ ఆర్ పరిహారం అందిస్తాం. – చెరుకూరి శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ -
గ్రేటర్ సిటీకి తీరని ముప్పు! హైదరాబాద్ వరదల చరిత్ర చూస్తే బేజారే!
సాక్షి, హైదరాబాద్: పట్టుమని పది సెంటీమీటర్ల వాన కురిసిన ప్రతిసారి విశ్వనగరం మునకేస్తోంది. హైదరాబాద్ ప్రధాన నగరం సహా శివార్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బండారీ లేఅవుట్, నాచారం తదితర ప్రాంతాల్లోని వారం, పదిరోజులపాటు ముంపులోనే మగ్గాల్సిన దుస్థితి నెలకొంది. చరిత్ర పుటలను తిరగేసినా ఎన్నోమార్లు నగరం వరద విలయంలో చిక్కి విలవిల్లాడినట్టు స్పష్టమవుతోంది. ఈ దురవస్థకు చరమగీతం పాడుతూ విశ్వనగర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. వందేళ్ల కిందట మూసీ వరదలు, నగర తాగునీటి అవసరాలు, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం అహరహం శ్రమించిన ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమగ్ర మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మరో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి హైదరాబాద్ నగరానికి వరదలు, విపత్తుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెరుగుతున్న వరద, ముంపు సమస్యలు ►ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటిన్నరకు చేరువైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహా నగరంలో 185 చెరువులు, 1,500 కిలోమీటర్ల పొడవైన నాలా వ్యవస్థ ఉన్నాయి. ఇందులో ముఖ్య ప్రాంతాల్లో 900 కిలోమీటర్ల మేర, శివార్లలో 600 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. ►నాలాలపై అనధికారికంగా పదివేలకుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు బల్దియా అంచనా. వాటిని తొలగించడంలో తొలి నుంచీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నాలాల ప్రక్షాళనకు సుమారు రూ.పదివేల కోట్ల అంచనా వ్యయంతో బల్దియా సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక అటకెక్కింది. దీనితో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సాఫీగా వెళ్లేదారిలేక జనావాసాలు నిండా మునుగుతున్నాయి. ►రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. ఇందులో జలమండలి 700 మిలియన్ లీటర్ల మేర శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. ►గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వెలువడుతున్న మురుగునీరు ఓపెన్ డ్రెయిన్లు, నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినపుడు ప్రధాన రహదారులపై మురుగు పోటెత్తుతోంది. ►శివారు ప్రాంతాల్లోని డ్రైనేజీలు సరిగా లేక నివాస సముదాయాల్లో మురుగు ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లో మగ్గుతోంది. ►రోజువారీగా గ్రేటర్లో వెలువడుతున్న మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రస్తుతమున్న డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. ►ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మాస్టర్‌ప్లాన్ అమలు కోసం సుమారు రూ.5 వేల కోట్లు అవసరం. దీనిని ప్రభుత్వం విస్మరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 14 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే 40శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో అక్టోబర్‌లో కురిసిన వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే.. 2020 అక్టోబర్ 14న అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. వరదల చరిత్ర ఇదీ ►1591 నుంచి 1908 వరకు 14సార్లు హైదరాబాద్ నగరం వరద ప్రవాహంలో చిక్కుకుంది. 1631, 1831, 1903 వరదలతో హైదరాబాద్‌లో భారీగా ధన, ప్రాణనష్టం సంభవించింది. ►1908 నాటి వరదల్లో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి. 15వేల మంది మృతి చెందారు, 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల వరకు జనజీవనం స్తంభించింది. ►1631లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో సంభవించిన వరదలకు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు «ధ్వంసమయ్యాయి. మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకున్నారు. ►200ఏళ్ల అనంతరం 1831లో మీర్ ఫర్కుందా అలీఖాన్ నాసరుద్దౌలా పాలనా కాలంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. వేలాది గుడిసెలు, మట్టి ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అప్పట్లో పురానా హవేలీలోని నాలుగో నిజాం నివాసం దాకా వరద నీరు చేరింది. నాసరుద్దౌలా వరద బాధితులకు సాయం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డుకు దూరంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ►మళ్లీ ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ పాలనా కాలమైన 1903 సెప్టెంబర్‌లో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి అతలాకుతలమైంది. మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసీ ప్రమాద స్థాయిలో ప్రహహించి, భారీ నష్టం సంభవించింది. ►తర్వాత 1968, 1984, 2007, 2016, 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసీ పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. -
ఆసిఫాబాద్‌లో భారీ వర్షం
ఆసిఫాబాద్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలకేంద్రంలోని దిగువ ప్రాంతాలు బాపూ నగర్, ఫైతాజీ నగర్ లలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. భారీ వర్షానికి జన జీవనం స్థంభించింది. -
ఆసిఫాబాద్‌లో భారీ వర్షం
ఆసిఫాబాద్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలకేంద్రంలోని దిగువ ప్రాంతాలు బాపూ నగర్, ఫైతాజీ నగర్ లలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. భారీ వర్షానికి జన జీవనం స్థంభించింది. -
ఆసిఫాబాద్‌లో భారీ వర్షం
- ఇళ్లలోకి చేరిన నీరు - స్తంభించిన జనజీవనం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటలపాటు కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. బజార్‌వాడి, పైకాజినగర్, మార్కండేయ కాలనీ, చెక్‌పోస్ట్, కంఠ కాలనీ, తారకరామానగర్ కాలనీలో జలమయం అయ్యూయి. మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. పైకాజీనగర్కు చెందిన పూసాల శంకర్, బట్టుపెల్లి విలాస్, రంగ సుభాష్ ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నిత్యావసర వస్తువులు, ఫ్రిజ్, కూలర్ తడిసిపోయూరుు. వివేకానంద చౌక్‌లోని వేప చెట్టు వర్షంతో నేలకొరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని పలువురి ఇళ్లు జలమయం అయ్యాయి. సర్పంచ్ మర్సకోల సరస్వతి కాలనీల్లో పర్యటించారు. మార్కండేయ కాలనీలో వర్షం నీరు వెళ్లేలా ప్రొక్లయినర్‌తో చర్యలు చేపట్టారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోందని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. జిల్లాలో 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 15.4 మిల్లీమీటర్ల సగ టు వర్షపాతం నమోదైంది. 35 మండలాల్లో ఓ మో స్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జైనథ్ మండలం లో 92.2 మిల్లీమీటర్లు, బజార్హత్నూర్లో 60.0, తలమడుగులో 57.4, నిర్మల్‌లో 49.0, సిర్పూర్(టీ) లో 43.4, ఇంద్రవెల్లిలో 40.6, గుడిహత్నూర్‌లో 39.0, లక్ష్మణచాందలో 32.2, భీమినిలో 26.8, ఖా నాపూర్‌లో 25.8, దహెగాంలో 24.6, దిలావర్ పూర్ లో 22.2, తానూర్‌లో 20.6, భైంసాలో 19.0, సిర్పూర్(యూ)లో 19.0, కౌటాలలో 16.4, తాంసిలో 16.4, నేరడిగొండలో 16.2, సారంగాపూర్‌లో 16.2, జన్నారంలో 14.8, కాగజ్‌నగర్‌లో 13.2, బేలలో 11.4, ఆదిలాబాద్‌లో 8.4, ఆసిఫాబాద్‌లో 8.4, దం డేపల్లిలో 8.2, జైనూర్‌లో 8.0, కుభీర్‌లో 7.2, మామడలో 7.4, బోథ్‌లో 7.2, కాసిపేటలో 7.2, కుంటాలలో 6.8, ఇచ్చోడలో 6.4, కెరమెరిలో 5.4, మందమర్రి మండలంలో 5.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 625.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 508.2 మిల్లీమీటర్లు పడింది. 19శాతం లోటు వర్షపాతంగా ఉంది. -
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్.. 9 కాలనీలకు నీటిముంపు భయం
రాష్ట్ర రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సాగర్ నీటిమట్టాన్ని పరిశీలించారు. ప్రమాద స్థాయికి చేరుకోవడం వల్ల తొమ్మిది కాలనీలకు నీటిముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం స్థాయి513.41 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 513.20 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశముంది. దీంతో సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.