ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్.. 9 కాలనీలకు నీటిముంపు భయం
రాష్ట్ర రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హుస్సేన్ సాగర్లోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సాగర్ నీటిమట్టాన్ని పరిశీలించారు. ప్రమాద స్థాయికి చేరుకోవడం వల్ల తొమ్మిది కాలనీలకు నీటిముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు.
హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం స్థాయి513.41 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 513.20 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశముంది. దీంతో సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.