ఆసిఫాబాద్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది.
ఆసిఫాబాద్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలకేంద్రంలోని దిగువ ప్రాంతాలు బాపూ నగర్, ఫైతాజీ నగర్ లలో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. భారీ వర్షానికి జన జీవనం స్థంభించింది.