ఎర్రవల్లిలో బారులు తీరిన భక్తులు
Published Fri, Dec 25 2015 11:26 AM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం నుంచి వరుస సెలవులు కావడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల కల్లా దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు ఎర్రవల్లి వచ్చారు. ఎర్రవల్లికి వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement