
సాక్షి, హైదరాబాద్: గృహ హింస నిరోధక చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుపుతూ.. విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్–11(ఎ) ప్రకారం ఈ చట్టం గురించి టీవీలు, పత్రికల్లో అవగాహన కల్పించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయ విద్యార్థి తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళల రక్షణ కోసం ఈ చట్టా న్ని తీసుకొచ్చారని, దీని గురించి అవగాహన కల్పించకపోవడంతో చట్టం ఉద్దేశం నెరవేరడం లేదని యోగేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment