Domestic Violence Act
-
విడిపోదామనుకున్న దంపతులను ఒక్కటిగా చేస్తూ..
విజయనగరం ఫోర్ట్: చూపులు కలిసి ఒక్కటైనవారే వారంతా...కానీ క్షణికావేశంలో మాటామాటా పెరిగి దూరమయ్యారు. విడపోదామనుకున్న ఆ మనసులను రంజింపచేసి రాజీ బాట పట్టించారు. విరిగిన హృదయాల్లో ప్రేమను మళ్లీ చిగురింపజేసి సరికొత్త జీవితాన్ని చూపించారు. వారే గృహ హింస విభాగ ప్రతినిధులు. విడిపోవడం ఓ క్షణం ... అదే దగ్గరైతే జీవితమే మకరందమంటూ ఎన్నో జంటల్లో మానసిక పరివర్తనను తేగలిగారు ఆ ప్రతినిధులు. ►ఆనందపురం మండలానికి చెందిన మహిళకు పూసపాటిరేగ మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నేళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. 2019లో తనను, పిల్లలను సరిగా చూడడం లేదని, మనోవర్తి ఇప్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆ మహిళ ఆశ్రయించింది. దీంతో గృహహింస విభాగం కౌన్సిలర్లు భార్యాభర్తలకు పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించి ఒక్కటి చేశారు. ►గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళకు అదే మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి కాపురం కొన్ళేళ్లు సజావుగా సాగింది. వివాహం జరిగిన మూడేళ్లు తర్వాత తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి విముక్తి కల్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలర్లు భార్య,భర్తలకి కౌన్సిలింగ్ నిర్వహించి చేయీ చేయీ కలిపించారు. ►అదో గృహ హింస విభాగం. ఈ విభాగంలో ఒక సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, ఇద్దరు హోం గార్డులు పనిచేస్తున్నారు. అక్కడకు వచ్చిన వారంతా భర్తతో, అత్తమామలతో హింసలకు గురైనవారే. భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కొందరు, భర్తతో కలిసి ఉండేలా చూడాలని మరి కొందరు. వీరంతా తమ గోడును కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గృహహింస విభాగానికి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న బాధితులే. కౌన్సిలింగ్ ద్వారా... గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన మహిళలనుతన భర్తతో కలిసి ఉండేలా కౌన్సిలర్లు చర్యలు చేపడతారు. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలర్లు ఇద్దరు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకసారి కౌన్సిలింగ్లో రాజీపడని వారికి పలు దఫాలుగా పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు ఆ దంపతులను కలిపే ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లో రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా విడాకులకు కాకుండా ఒక్కటయ్యే మార్గాన్నే వారు చూపిస్తారు. విడాకులనేది ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారు. 130 మందిని మళ్లీ ఒక్కటిగా చేశారు 2006లో గృహహింస విభాగం జిల్లాలో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 767 మంది గృహహింస విభాగాన్ని అశ్రయించారు. వీరిలో కౌన్సిలింగ్ ద్వారా 130 మందిని కలిపారు. 122 మంది కేసులను ఉపసంహరించుకున్నారు. 512 కేసులు కోర్టులో వేయగా 65 మంది కోర్టు సమక్షంలో మళ్లీ చేయీచేయీ కలిపారు. 257 కేసులకు తుది తీర్పు వచ్చాయి. 149 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. సంతోషంగా ఉంది కుటుంబ కలహాలతో మా దగ్గరకు వచ్చే వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం చెబుతాం. చాలా మందికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కలిశారు. విడిపోదాం అనుకొని వచ్చిన వారిని కలపడం ఎంతో సంతోషంగా ఉంటుంది. – జిల్లెల రజని, సోషల్ కౌన్సిలర్ ఉచిత న్యాయ సహాయాన్నిఅందిస్తాం కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తాం. వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తాం. కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా చాలా మంది రాజీ పడి కలిసిన సందర్భాలున్నాయి. – జి. మాధవి, లీగల్ కౌన్సిలర్ -
లాక్డౌన్లో గృహహింస పెరిగింది
-
మహిళలకు రక్షణ చక్రం
సాక్షి, విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన ఓ వివాహితను భర్త, అత్త, ఆడపడుచులు కొంతకాలంగా వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక ఆమె గృహహింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. బొబ్బిలి మండలానికి ఓ వివాహిత తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని గృహ హింస నిరోధక విభాగాన్ని ఆశ్రయించింది. ఈ ఇద్దరే కాదు.. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. అలాంటి బాధితులకు గృహహింస చట్టం విభాగం అండగా నిలుస్తోంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల వారి పిల్లలు దిక్కులేని వారిగా మిగులుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వల్ల వేధింపులకు గురయ్యే వారు నేరుగా గృహహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టయితే ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తారు. గృహహింస విభాగంతో పాటు అదనంగా వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యాయసహాయంతో పాటు అత్యాచారానికి గురైన మహిళలకు వైద్య సహాయం కూడా అందిస్తారు. గృహహింస అంటే.. శారీరకంగా.. లేదా మానసికంగా లేదా మాటల ద్వారా ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింసలు, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జనానికి పాల్పడటం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే విధంగా వ్యవహరించే చర్యలన్నీ గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య సంబంధం భార్యభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా లేదా పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్న వారైనా.. ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ, పురుషులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. గృహహింసకు గురైన మహిళ నేరుగా లేదా ఎవరితోనైనా హింస జరుగుతుందని, జరగబోతుందని రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ తదితర బాధ్యతల విషయంలో రక్షణాధికారి చర్యలు తీసుకోవాలి. ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సహాయం సమాచారం బాధితురాలికి అందజేయాలి. గృహహింస నిరోధక కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. మహిళల హక్కులు స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే దాన్ని హక్కుగా గౌరవించాలి ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 ఏళ్లు నిండిన మహిళ తన ఇష్టం వచ్చిన పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. భార్య ఉన్న పురుషుడిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. హిందూ మహిళ తనకు 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 ఏళ్లు నిండే లోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. మహిళను బలవంతంగా కాపురానికి తీసుకుని వెళ్లే హక్కు ఎవరికి లేదు. 18 ఏళ్లు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకుని వెళ్లి వివాహం చేసుకుంటే.. సెక్షన్ 366 ప్రకారం యువకునికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అలా వివాహం చేసుకుంటే నేరం. ముస్లిం మహిళల విషయంలో ఈ నిబంధన చెల్లదు. వివాహమైన ఏ మతానికి చెందిన మహిళ అయినా భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోరాదు. -
‘గృహ హింస’పై అవగాహనకు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: గృహ హింస నిరోధక చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుపుతూ.. విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్–11(ఎ) ప్రకారం ఈ చట్టం గురించి టీవీలు, పత్రికల్లో అవగాహన కల్పించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయ విద్యార్థి తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళల రక్షణ కోసం ఈ చట్టా న్ని తీసుకొచ్చారని, దీని గురించి అవగాహన కల్పించకపోవడంతో చట్టం ఉద్దేశం నెరవేరడం లేదని యోగేశ్ తెలిపారు. -
పిల్లలు ఎఫెక్ట్ అవుతారు
తల్లిదండ్రులూ.. కాస్త జాగ్రత్త. చిన్నారుల ఎదుట అస్తమానం కీచులాడుకుంటూ ఉండటం, తల్లిపై తండ్రి గృహహింసకు పాల్పడుతూ ఉండటం చిన్నపిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. చిన్న వయసులో పసిపిల్లల ఎదుట తల్లిదండ్రుల కొట్లాటలూ, ఇంట్లో ఒకరినొకరు మానసికంగా హింసించుకోవడం జరుగుతుంటే... ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లలో చాలా రకాల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అలైస్ షేర్మెర్హార్న్ అంటున్నారు. అధ్యయనం కోసం ఆమె తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయసున్న 99 మంది చిన్నారులను ఎంపిక చేశారు. వాళ్ల వాళ్ల భావోద్వేగ స్థాయిలను బట్టి ఆ సమూహాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఆ తర్వాత వారికి రకరకాల భావోద్వేగాలతో ఉన్న జంటల ఫొటోలు చూపించారు. ఆ ఫొటోల్లోని జంటలు కొన్ని కోపంగా ఉంటాయి. మరికొన్ని సంతోషంగా ఉంటాయి. కొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఆ ఫొటోలను చూసి ఆ జంటల తాలూకు వాస్తవ భావోద్వేగాలను పిల్లలు చెప్పాలి. అయితే తమ ఇళ్లలో తీవ్రమైన కీచులాటలు, పోట్లాటలను చూసే పిల్లలు ఫొటోల్లో కనిపించే భావోద్వేగాలను సరిగా గుర్తించలేకపోయారట! అంటే... వాళ్ల మెదడుల్లో భావోద్వేగాలను ప్రాసెస్ చేసే యంత్రాంగం దెబ్బతిన్నట్లు ఈ పరిశోధన తెలుపుతోందని అధ్యయనవేత్తలు అంచనావేశారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్ అనే సంచికలో ప్రచురితమయ్యాయి. -
తెగిన రెక్కలు..బతుకు ముక్కలు
పెళ్లి వయసు కాదు.. మెడలో తాళి పడింది. ఇకపై అన్నీ ఆయనే.. ఈ పెత్తనంతోనేమో ఆదరించాల్సిన చేతులు పదే పదే లేచాయి. కాపు కాయాల్సిన కళ్లు అణువణువూ అనుమానపు పొరలు కప్పుకున్నాయి. ఆయన తాగొచ్చిన ప్రతిసారీ ఆమె శరీరంపై వాతలు తేలాయి. ఇది వరకెప్పుడూ కన్నీళ్లు రాలేదు.. పెళ్లయ్యాక అవే తోడయ్యాయి. రోజూ వేధింపులే.. ఇక భరించలేనంటూ ఇద్దరు బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మనిషి రూపంలో ఉన్న ఆ మృగం అక్కడికీ వచ్చాడు. కిరాతకంగా ఆమె రెండు చేతులు తెగ నరికాడు. బతుకును ముక్కలు చేశాడు. ఆ సమయంలో బతకలేననుకుంది.. ఇద్దరు పిల్లలు..వాళ్లకు రెక్కలు తేవాలి.. ఆ మానవ మృగానికి శిక్ష పడాలి. అందుకే బతకాలి. పోరాడింది.. ఆ మృగాడిని కటకటాల వెనక్కి పంపే వరకూ పోరాడింది. ఇప్పుడు బిడ్డల భవిష్యత్తే శ్వాసగా కాలం వెళ్లదీస్తోంది తెనాలికి చెందిన బీబీజాన్..మళ్లీ అమ్మ ఒడిలో చిన్నపాపగా.. అనుమానం పెనుభూతంలా మారిన కర్కశత్వానికి రెండు చేతులనూ కోల్పోయిన మానవి తెనాలికి చెందిన బీబీజాన్ (28). గృహహింసతో బిడ్డలతో సహా పుట్టింటికి పారిపోయిన ఆమెను భర్త వదల్లేదు. తలుపు పగులగొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించి, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న తనను నరికాడు. తెగిపడిన చేతులను పట్టుకుని రాక్షసంగా ప్రవర్తించాడు. ఆరేళ్లుగా ప్రతి చిన్నపనికీ తల్లిపై ఆధారపడుతూ రోజులు నెట్టుకొస్తోంది. ఆటవిక దాడికి పాల్పడి తనను జీవితాంతం నిస్సహాయురాలిగా చేసిన తాళి కట్టిన మృగాన్ని జైలుకు పంపాలన్న పంతాన్ని నెరవేర్చుకుంది. హాస్టల్లో ఉంటూ చదువుతున్న బిడ్డల భవిష్యత్తే బతుక్కి శ్వాసగా జీవిస్తోంది. 2012 జనవరి 6 నాటి దుర్మార్గం, న్యాయపోరాటం, జీవితేచ్ఛతో సాగిస్తున్న జీవన పోరాటం తన మాటల్లోనే... తెనాలి: ‘వాడు మొగుడు కాదు..రెండు కాళ్ల జంతువు. వాడి పీడ పడలేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని, అమ్మ దగ్గరకొచ్చి ఉంటున్నా. 2012 జనవరి 6వ తేదీ శుక్రవారం. మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి. గుండె జారిపోయింది. నేలక్కరుచుకోవటమే గుర్తుంది...’ అని నాటి ఆటవిక దాడిని తలచుకున్నపుడు బీబీజాన్ ఉద్వేగానికి గురైంది. రెండు చేతులూ నరికేశాడు... నా పేరు బీబీజాన్. మాది తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ. నాకు 15 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. 22 ఏళ్ల వయసుకే ఐదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు. భర్త చిన ఖాశింది బట్టల వ్యాపారం. తాగటం, తన్నటం, గొడవలు పడటం మామూలే. కొద్ది రోజులకు సర్దుకుపోతుంటాం. నాపై అనుమానం రోజురోజుకీ పెరగసాగింది. హింస భరించటానికి కష్టమైంది. మెగుడూ మొద్దులూ వద్దనుకొని బిడ్డల్ని తీసుకొని అమ్మ వాళ్లింటికెళ్లి తలదాచుకున్నా. అక్కడ కూడా వదల్లేదా దుర్మార్గుడు. ఆ రోజు బలవంతంగా ఇంట్లోకి వచ్చి నా చేతులు నరికేశాడు. వీపుపైనా, తొడల మీదా చేసిన దాడికి ఒళ్లు పచ్చిపుండైంది. చచ్చిపోయాననే అనుకున్నా. బతకలేదన్నారు... మెలకువ వచ్చేసరికి ఎక్కడున్నానో తెలీదు...‘పోయిందిగా...పోస్టుమార్టంకు పంపుదామా’ అన్న మాటలు వినిపించాయి. ఎవరో చేతిని పట్టుకుని, ‘లేదు..లేదు బతికే ఉంది’ అన్నారు. మెల్లగా కళ్లు తెరిచి చూశాను. పెద్దాసుపత్రిలో ఉన్నట్టు అర్థమైంది. డాక్టరు, నర్సులు, పక్కన పోలీసులు...చేతులకేసి చూసుకుంటే భుజాల దిగువన కట్లు...దుఃఖం తన్నుకొచ్చింది. నాకు తెలియకుండానే కన్నీటి పొర కట్టలు తెంచుకుంది. మంచం పక్కనే బిడ్డలు బిక్కమొఖంతో నా రెండు చేతులవైపు అమాయకంగా చూస్తున్నారు. వారిని దగ్గరకు తీసుకుందామని రెండు చేతులు చాచపోయాను. సూదులు పొడిచినట్లు నొప్పులు..బిడ్డలను పట్టుకోలేకపోయాననే గుండెలను పిండే బాధ.. రెండూ ఒకేసారి కలిపి నా దుస్థితిని వెక్కిరించినట్టే అనిపించాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిన కళ్లలో పిల్లలే మెదిలాడారు. అభం శుభం తెలీని వాళ్ల కోసం ఎలాగైనా బతకాలనుకున్నాను. ఇదే సమయంలో నాపై ఘోరానికి తలపడిన కిరాతకుడికి శిక్ష పడేలా చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పంతోనే మూడు నెలలకుపైగా మృత్యువుతో పోరాడి బతికా. మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి. న్యాయపోరాటంలో గెలిచా... సిరి మహిళా సాధికారిత సంఘం అనే సంస్థ అండగా న్యాయ పోరాటానికి దిగా. కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయ్. ‘సిరి’ ప్రతినిధులు తోడునీడుగా వీటిని ఎదుర్కొన్నాను. రాయబారాలు నడిపిన ప్రబుద్ధుడు నేరుగా కాళ్ల బేరానికొచ్చాడు. రూ.3 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టినా లొంగ లేదు. న్యాయ పోరాటంలో గెలిచాను. ఘాతుకానికి తగిన శిక్ష పడింది. ప్రభుత్వానికి నా బాధను విన్నవించాను. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ నా బిడ్డలు సద్దాం హుస్సేన్ (11) ఆరో తరగతి, ఆసియాబేగం (10) ఐదో తరగతి చదువుతున్నారు. నా తల్లికి రోజూ కన్నీటితో అభిషేకిస్తున్నా.. తల్లి షేక్ హబీబూన్ (55) సంరక్షణలో ఉంటూ నేను జీవనపోరాటం చేస్తున్నా. పసితనంలో సాకినట్టే, ఈ వయసులోనూ నా ఆలనాపాలన చూస్తోంది. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ ‘పెద్దయ్యాక నాకు ఇంత ముద్ద పెడతావా బేటీ’ అనేది. కానీ ఈ వయసులో కూడా అమ్మే నాకు తినిపించాల్సి వస్తోంది. అమ్మ మాటలు తలుచుకుంటే గుండె చెరువవుతుండేది. ఏం చేయను. తల్లి రుణం ఎలా తీర్చుకోగలను. అమ్మకు రెండు చేతులతో మొక్కలేని అశక్తురాలిని. అందుకే రోజూ మనసులోనే కన్నీటితో అభిషేకం చేస్తున్నా. పింఛను డబ్బులు, రేషను బియ్యమే మా జీవనాధారం. ఇంత పేదరికం అనుభవిస్తున్నా..కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నా నాకున్న ఆశ ఒక్కటే. బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ల జీవితాలను విద్యా దీపంతో వెలిగించాలి. పదో తరగతి తర్వాత ఎలాగనేది అర్థం కావటం లేదు. సమాజంలో ఏదో మూల మానవత్వం బతికే ఉందనుకుంటున్నా.. అదే నా బిడ్డలకు చేయూతనిస్తుందనే నమ్మకంతో బతుకుతున్నా. -
2K ‘వాక్’
గర్ల్స్.. నాట్ బ్రైడ్స్ ఏమిటి? 10వేల మంది బాలికలతో ‘వాక్’ ఎప్పుడు? 4ఫిబ్రవరి 2018 ఎందుకు? బాలికల కనీస వివాహ వయసును 18 నుండి 21కి పెంచాలని. ఎక్కడ? హైదరాబాద్ (లాల్ దర్వాజా నుంచి చార్మినార్ వరకు) ఎవరు? బాలల హక్కుల సంఘం చిల్డ్రన్స్ స్పర్శ్ ఫౌండేషన్ ‘‘అక్కా.. నందిని మొహంలో మళ్లీ మునపటి కళ కనిపిస్తుందే..’’ అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన నందినిని చూస్తూ అన్నాడు శ్రీరామ్. ‘‘అవున్రా.. అది అట్లా నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ సరదాగా ఉంటే ఇల్లే సందడిగా ఉంది. పాతరోజులు గుర్తొస్తే ఎంత తప్పు చేశాం? అనిపిస్తుంటుందిరా..’’ తమ్ముడికి టీ కప్ అందించి అతని పక్కనే కూర్చుంటూ అన్నది అనంతలక్ష్మి. నిట్టూర్చాడు ఆమె తమ్ముడు! నందిని గతం.. ఒక గందరగోళం! నందిని చిన్నప్పటి నుంచీ చురుకైన పిల్ల. ఆటలంటే ఆసక్తి. ఉత్సాహంగా ఉండేదెప్పుడూ. టెన్త్‌లో స్కూల్ టాపర్. మేథమెటీషియన్ కావాలని ఆ పిల్ల కోరిక. చదువంటే బిడ్డకున్న ఇంట్రెస్ట్ చూసి మురిసిపోయాడు ఆయన. కాని ఆ వారమే పిల్ల ఆశను తుంచేసే నిర్ణయం తీసుకుంటాడని ఆ క్షణంలో అతనికి తెలియదు. ఏమైంది? నందిని మేనత్త ఓ సంబంధం తీసుకొని వచ్చింది. బాగా ఆస్తిపరులు, అబ్బాయికి సర్కార్ కొలువు. బంధువుల పెళ్లిలో నందినిని ఆ అబ్బాయి చూశాడు. మనసు పారేసుకున్నాడు. నందినినే చేసుకోవాలనుకుంటున్నాడు. అదీ ఆమె రాయబారం. ‘‘పెళ్లి వయసా దానిది? సమస్యే లేదు’’... నందిని తండ్రి కళ్లెర్రజేశాడు చెల్లి మీద. అయినా ఆమె ప్రయత్నం వీడక తన తల్లి ద్వారా విషయాన్ని ముందుకు కదిల్చింది. నువ్వు కట్నకానుకలిచ్చే పరిస్థితుల్లో లేవు. దాని వెనక ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారసుడి కోసం ముగ్గురు ఆడపిల్లలను కంటివి. ఈ ముగ్గురికీ చదువులు, కట్నాలు ఇచ్చి పెళ్లి్ల చేయగల స్థితిలో ఉన్నావా? నా మాటవిని.. ఉష తెచ్చిన సంబంధానికి ఊ అను’’ అని పోరింది నందిని నానమ్మ. ఈ నసకు నందిని, ఆమె తల్లి అనంతలక్ష్మి భయపడిపోయారు. నందిని తండ్రి ఆలోచనలో పడ్డాడు. ‘‘నందినికి చదువుకోవాలనుంది. చదివిద్దాం. దాని భవిష్యత్ అది చూసుకుంటుంది’’అంది రాత్రి భోజనాలయ్యాక భర్తతో అనంతలక్ష్మి. ‘‘నాకెందుకో మా అమ్మ చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. దానికి చదువు మీద మోజు ఉంది కాని చదివించి, అంతే ఖర్చుతో పెళ్లిచేసే స్థోమత మనకుండొద్దూ..? నందిని విషయంలో అమ్మ చెప్పినట్టే చేద్దాం’’ అని అటు తిరిగి పడుకున్నాడు అతను. అవాక్కయింది అనంతలక్ష్మి. పెళ్లయింది! నందినికి చేసిన ప్రామిస్‌ను ఆ తండ్రి ఆ రకంగా బ్రేక్‌చేసి ఆమెను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు బలవంతంగా.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో. కళ్లనిండా నీళ్లతో తలవంచి తాళి కట్టించుకుంది నందిని. భవిష్యత్ కలలు, లక్ష్యాలన్నిటినీ పమిట చెంగుకు కట్టేసుకొని మౌనంగా కాపురానికి బయలుదేరింది. ఏమీ తెలియని అమ్మాయిని ఏమేమో అడిగాడు ఆమెకన్నా సగం వయసు ఎక్కువున్న భర్త. బిక్క మొహం వేసింది నందిని. కొట్టాడు. భరించింది. కాపురం చేయడం చేతకాదని చీత్కరించాడు. అంటే ఏంటో అర్థంకాని అమ్మాయి తప్పు తనదేకామోసని నోర్మూసుకుంది. దాదాపు రోజూ లైంగికంగా దాష్టీకమే. పెళ్లయి ఆర్నెల్లయినా గర్భం రాలేదని అత్తగారి పోరూ ప్రారంభమైంది. ఆ వంకతో అత్త, భర్త చేయిచేసుకున్నారు. మనసుకు, శరీరానికి తగిలిన గాయాలతో పుట్టిల్లు చేరింది.నందినిని చూసిన తల్లి మనసు తరుక్కుపోయింది. ఇక్కడ మళ్లీ మేనత్త, నానమ్మ పెత్తనం తీసుకొని ‘అత్తింట్లో అవన్నీ మామూలే, సర్దుకోవడం నేర్పించు పిల్లకు’ అని అనంతలక్ష్మికి చెప్పి, నందిని తిరిగి అత్తింటికి పంపించారు. అక్కడా షరా మామూలే. ఈసారి పిల్లలు పుట్టడం కోసం మందులు, మాకులు ఇప్పిస్తామని నాటువైద్యుల చుట్టూ తిప్పారు. పిల్ల ఆరోగ్యం చెడింది. పుట్టింటికి పంపారు. ఆరునూరైనా సరే వెళ్లనని భీష్మించుకుంది నందిని. చదువుకుంటానని తండ్రి కాళ్లు పట్టుకుంది. ఈసారి అనంతలక్ష్మీ గట్టిగా ఉంది తన పట్టు మీద. తండ్రికీ బిడ్డ పరిస్థితి అర్థమైంది. కోర్టుకు వెళ్లాలనుకున్నారు. బాల్య వివాహంకింద వీళ్లకూ అక్షింతలు పడ్తాయని బంధువుల్లో ఒకరు బెదిరించడంతో కుల పెద్దలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. నందిని అత్తింటికి వెళ్లకుండా కాలేజ్‌కు వెళ్లడం మొదలుపెట్టింది. ఇది నిజంగా జరిగిన ఘటన. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు. హైదరాబాద్‌లోనే. ఇదొకటే కాదు, బాల్య వివాహాల సంఖ్య రెండు రాష్ట్రాల్లో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదని ‘బాలల హక్కుల సంఘం’ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాల్య వివాహాల వల్ల గృహహింస కూడా పెరుగుతోందని, అందుకే బాలికల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు ఉండాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇందు కోసం పదివేల మంది బాలికలతో ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో ‘వాక్’ నిర్వహిస్తోంది. చిల్డ్రన్స్ స్పర్ష్ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ప్రతిబింబంగా పిల్లల వేషధారణ కూడా ఉంటుంది. 21 ఏళ్లే సరైన వయసు శారీరకంగానే కాదు మానసికమైన పరిపక్వత కూడా చాలా అవసరం. ఇప్పటి పిల్లలు చాలా ప్రేమగా పెరుగుతున్నారు. పద్దెనిమిదేళ్లొచ్చినా ఇంకా అమ్మానాన్నను పట్టుకునే ఉంటున్నారు. పైగా చదువూ ఇంటరే కదా! లోకం తెలియని వయసు. అంతేకాదు వాళ్ల జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తిని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి 21 ఏళ్లు అనేది అమ్మాయిల పెళ్లికి కరెక్ట్ ఏజ్. అప్పటికీ ఓ డిగ్రీ వస్తుంది. వాళ్ల జీవితాన్ని వాళ్లు లీడ్ చేసుకునే శక్తీ వస్తుంది. డగ్రీ వరకు చదువుంటే మ్యారేజ్ తర్వాత ఏవైనా సమస్యలు వచ్చి రిలేషన్ బ్రేక్ అయినా ధైర్యంగా బతకగలరు. కాబట్టి ఫ్యామిలీపరంగా.. సోషల్లీ 21 ఏళ్లు సరైన వయసు. ఫిజికల్లీ.. మెంటల్లీ కూడా 21 ఏళ్లు అమ్మాయిలకు కరెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్. – డాక్టర్ వి. శోభ, గైనకాలజిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ చట్టం వైపు ‘వాక్’ పద్దెనిమిదేళ్లు అంటే ఇంకా చదువు సగంలోనే ఉంటుంది. 21 ఏళ్లకు ఒక సెటిల్మెంట్ వస్తుంది. జీవితం పట్ల ఓ దృక్పథం ఏర్పడుతుంది. మెంటల్లీ, ఫిజికల్లీ మెచ్యూరిటీ వస్తుంది. ఫైనాన్షియల్‌గా, సోషల్‌గా నిర్ణయాలు తీసుకోగలరు. పైగా ఓ డిగ్రీ వరకు చదువూ ఉంటుంది. అందుకే అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 మార్చాలి. ఇలాంటి ఈవెంట్ల ద్వారా ‘చట్టం’లో మార్పు తెచ్చుకునే వీలుంటుంది. – పద్మజ, డీసీపీ భద్రత కోసం అభద్రతలోకి! ‘‘పెళ్లికాని అమ్మాయికి సెక్యూరిటీ లేదు. పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెడితే అన్నీ వాడే చూసుకుంటాడు’’ అని అంటారు! అమ్మాయి మన బాధ్యత కాదా? రక్షణ లేకపోవడం వ్యవస్థ తప్పు. అందుకని అమ్మాయిల జీవితాలు బలి కాకూడదు కదా. ఒక దాన్నుంచి భద్రత కావాలని ఇంకో అభద్రతలోకి నెట్టడం ఎంతవరకు కరెక్ట్? కనీసం 21 ఏళ్లకు గానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి రాదు. సమాజానికీ ఆలోచన రావాలంటే ఇలాంటి ‘వాక్’లు అవసరం. – పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అవగాహన, మద్దతు కావాలి చట్టాలు చేసినప్పుడు.. ప్రభుత్వం అందుకు తగ్గ సౌకర్యాలు కూడా కల్పించాలి. అమ్మాయి నిరాటంకంగా చదువుకునేలా.. లేదా ఆర్థిక స్వావలంబన కోసం ఆమెకు నచ్చే ఏ రంగం ఎంచుకున్నా అందుకు తగిన వెసులుబాటు కల్పించాలి. అందుకే ఈ వాక్. ఆడపిల్లల హక్కులు, వాళ్ల చాయిస్‌కు çసంబంధించి సమాజంలో ఒక అవగాహన, దాని నుంచి ఒక మద్దతు కలిగించేలా ఇలాంటి వాక్స్ ఉపయోగపడ్తాయి. – రేవతీదేవి, ఎస్పీసీఆర్ సభ్యురాలు – సరస్వతి రమ -
కోర్టు శ్రీకాకుళంలో.. సాక్షులు అమెరికాలో!
రాష్ట్రంలోనే తొలిసారి ఆన్లైన్ విచారణ శ్రీకాకుళం పాతబస్టాండ్: సాక్షులు అమెరికాలో ఉన్నారు. కోర్టు శ్రీకాకుళంలో ఉంది. అయితేనేం.. సాంకేతిక పరిజ్ఞానం ఉరకలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో విచారణ ప్రక్రియకు దూరాన్ని చెరిపేస్తూ ఆన్లైన్లో సాక్షుల విచారణ జరిపారు న్యాయమూర్తులు. ఇలా ఆన్లైన్లో విచారణ చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత శ్రీకాకుళం కోర్టుకు దక్కింది. గృహ హింస చట్టం కింద నమోదైన కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి, ఫస్టుక్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వై.శ్రీనివాసరావు బుధవారం విచారణ చేశారు. ఈ కేసులో అమెరికాలో ఉన్న సాక్షులను ఆన్లైన్లో విచారించారు. సుప్రీంకోర్టు పలు కేసుల సందర్భాల్లో వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఇందులో విచారణ చేపట్టి రుజువులను నమోదు చేశారు.దీంతో కోర్టుకు సమయం ఆదాతోపాటు.. కక్షిదారులకు సమయం ఆదా, నగదు వ్యయం కూడా ఆదా అవుతుంది. -
మాజీ సీఎం అల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అల్లుడు సయిద్ మహ్మద్ ఇమ్రాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహహింస కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. షీలా కుమార్తె లతిక దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని అల్సూర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నవంబర్ 7న ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఇటీవలే బారాఖాంబా పోలీసుస్టేషన్ లతిక ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్, లతిక పది నెలల నుంచి విడిగా ఉంటున్నారు. -
హింసను... చండాడే చట్టం!
లీగల్ స్టోరీస్ భర్త అనే ట్యాగ్ ధరించి ఒక మగాడు నోరు పారేసుకుంటాడు... చేయిచేసుకుంటుంటాడు. మద్యం మైకంలో మాటిమాటికీ లేచే నోరూ, ఎత్తే చెయ్యితో హింసిస్తుంటాడు. మనశ్శాంతి దూరం చేస్తుంటాడు. ఇల్లంటే నరకానికి కేరాఫ్ అనిపిస్తుంటాడు. హింసిస్తూ ఇలా ఇంట్లో నరకం చూపెట్టే అలాంటి మగాళ్ల యాతనల నుంచి మహిళలను రక్షించే చట్టం ఇది! హింసించే చేతులను చండాడే చట్టమిది! ‘ఏయ్.. బయటికి రావే!’ అమర్యాద, ఆధిపత్యం కలగలిసిన చిరపరిచితమైన ఆ గొంతు విని ఉలిక్కిపడింది శాంత. క్లాస్‌లో సీరియస్‌గా పాఠం చెబుతున్న ఆమె ఏకాగ్రతను భంగం చేసిన ఆ కంఠం ఎవరిదో కాదు తన భర్తదే. చక్కగా పాఠం వింటున్న పిల్లలనూ డిస్టర్బ్ చేసింది ఆ కర్కశ స్వరం. తరగతి వైపు రానీయకుండా ప్యూన్ అడ్డుకుంటున్నా తోసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు భర్త. పుస్తకం బల్ల మీద పెట్టేసి గబగబ బయటకు నడిచింది. అప్పటికే వరండాలోకి పరిగెత్తుకొస్తున్నారు ప్రిన్సిపల్, ఇతరటీచర్లు. పరువుపోయిన ఫీలింగ్‌తో ‘ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను.. బయటకు వెళ్లి మాట్లాడుకుందాం’ అంది భర్తతో. ప్యూన్ చేతులను గట్టిగా విదిలించి చెదరిన షర్ట్‌ను సరిచేసుకుంటూ ‘ఎవతే నీ ప్రిన్సిపల్.. నీలాంటి తిరుగుబోతును ఇంకా రానిస్తుందంటే అదెలాంటిదో అర్థమవుతోంది’ అన్నాడు. ఆ వెనకాలే వస్తున్న ప్రిన్సిపల్‌కి ఈ మాటలు ఎక్కడ వినపడతాయో అని బెదురుతూ ‘సరే.. ముందు మీరు బయటకు వెళ్లండి మీ వెనకాలే నేనొస్తా’ అంది. ‘ఎందుకు వెళ్లాలే బయటకు? ఇక్కడే అందరి ముందు నీ బండారం బయటపెడ్తా.. ఈ పిల్లలకు తెలియాలివాళ్ల టీచర్ ఎలాంటిదో.. మీ కొలీగ్స్‌కి కూడా తెలియాలి. అప్పుడు గానీ నిన్ను తన్ని తగలెయ్యరు’అంటూ విషయాన్ని సాగదీయచూశాడు శాంత భర్త. ఈలోపు ప్రిన్సిపల్ ‘శాంతగారు.. ఏంటీ న్యూసెన్స్.. ఏమైంది?’ ప్రశ్నించింది శాంతను. ‘సారీ.. మేడం.. చిన్న పర్సనల్ప్రాబ్లం.. ఆయన మావారు’ అంటూ వివరణ, క్షమాపణ, వాళ్లాయన పరిచయమూ ఇచ్చింది శాంత. ‘ప్రాబ్లం చిన్నదైనా, పెద్దదైనా పర్సనల్ ఇష్యూస్ స్కూల్ కాంపౌండ్‌లో కాదు... ఇంట్లో లేదా బయట తేల్చుకోంది’ అంటూ కఠినంగా చెప్పి అక్కడి నుంచి కదిలింది ప్రిన్సిపల్! తలకొట్టేసినంత పనైంది శాంతకు. అవమాన భారంతో తల వంచి ముందుకు నడవసాగింది. తన లక్ష్యం నెరవేరిందన్న విజయగర్వంతో తల పెకైగరేసి భార్యను దాటేసి వేగంగా అడుగులు వేశాడు ఆమె భర్త. నేపథ్యం శాంత టీచర్. నాగరాజుదీ ప్రభుత్వ ఉద్యోగమే. రెండేళ్ల కిందట... తెలిసిన వ్యక్తుల ద్వారా కుదిరిందీ సంబంధం. ‘అబ్బాయి మంచివాడు, అంతకన్నా మంచి ఉద్యోగం, నా అన్నవాళ్లెవరూ లేరు. భార్యను ప్రేమగా చూసుకుంటాడు’ అన్న తల్లిదండ్రుల మాటలను నమ్మి నాగరాజుతో పెళ్లికి ఓకే అంది. మత్తు మనిషి.. పెళ్లయిన కొత్తలో ప్రపంచాన్ని మరిపించాడు నాగరాజు. రెండు నెలలలకు గానీ అర్థం కాలేదు శాంతకు నాగరాజు మామూలు మనిషి కాదు మత్తు మనిషి, పచ్చితాగుబోతు అని. తాగి ఇంటికి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడ్డం.. శాంతను అనుమానించడం, కనిపించిన వాళ్లతో సంబంధాలు అంటగట్టడం ఆయన డే షెడ్యూల్లో భాగమయ్యాయి. అదే కంటిన్యూ అయింది. ఒకరోజు.. తప్పతాగి ఇంటికొచ్చాడు. ‘తలుపు తీయడం లేట్ ఎందుకు అయింది?’ ఊగిపోతూ అడిగాడు డోర్ తెరిచిన శాంతను. ‘నిద్రపట్టింది.. వినిపించలేదు’ భర్త నోట్లోంచి వచ్చిన మందు వాసన నుంచి తల తిప్పుకుంటూ చెప్పింది శాంత. ‘అంతేనా.. లోపల ఎవడితోనైనా..’ తూలుతున్న శరీరాన్ని ద్వారం సహాయంతో లోపలికి ఈడ్చుకెళుతూ అన్నాడు నాగరాజు! కళ్లల్లో ఉబికి వచ్చిన నీటిని జారనీయకుండా జాగ్రత్తపడుతూ తలుపేసి డైనింగ్ హాల్లోకి వెళ్లి టేబుల్ మీద భర్తకోసం భోజనం సర్దసాగింది. ‘మొగుడంటే లెక్కలేదే.. మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు వెళ్లిపోతున్నావ్? పిచ్చోడినా నేను? చెప్పు లోపల ఎవరున్నారో?’ ‘ఎవరెందుకు ఉంటారు?’ సహనం నశించిన శాంత అరిచింది. ‘మళ్లీ గొంతు కూడానా? అసలు నిన్ను కాదే.. నీ అమ్మాబాబులను అనాలి.. బిడ్డను తిరుగుబోతును చేసినందుకు! అసలు నువ్ ఉద్యోగానికే పోతున్నావా..ఇంకెక్కిడికన్నానా? ఏయ్ రేపటి నుంచి గడప దాటావో చూడు’ తర్జని చూపిస్తూ బెదిరించాడు. ‘నన్ను ఉద్యోగం మానేయమనడానికి మీరెవరు? మా అమ్మానాన్న ప్రసక్తి తెస్తే ఊరుకోను. బెదిరించడం మీకే కాదు.. నాకూ వచ్చు’అంది కదలకుండా తీవ్రమైన స్వరంతో శాంత. ‘అవునా.. ఏదీ బెదిరించు’ అంటూ శాంత పైపైకి వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూసింది శాంత. రెచ్చిపోయిన నాగరాజు ఆమెను తోశాడు. జుట్టు పట్టి పైకి లాగి చెంపల మీద కొట్టాడు. ఆమెను బరబరా ఈడుస్తూ తలుపు తీసి బయటకు గెంటేశాడు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయింది శాంత. ఎంత తలుపు కొట్టినా తీయలేదు. చేసేది లేక .. తన ఇంటి గొడవ తల్లిదండ్రులతో చెప్పి వాళ్లను ఇబ్బంది పెట్టబుద్ధికాక ఆ రాత్రి తలదాచుకోవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తెల్లవారే వర్కింగ్ విమెన్ హాస్టల్లో చేరింది. అయిదు రోజులు గడిచాయి.. ఆరోరోజు ఇదిగో ఇలా.. స్కూల్‌కి వచ్చాడు నాగరాజు. స్కూల్ బయట.. ‘చెప్పండి.. స్కూల్‌కి ఎందుకు వచ్చారు?’ అడిగింది భర్తను. ‘ఎందుకు రావద్దు .. నువ్వెవడితో పడితే వాడితో తిరిగితే ఊరుకుంటాననుకున్నావా? నడువ్ ఇంటికి’ అంటూ ఆమె చేయిలాగబోయాడు. పక్కకు తప్పుకుంది శాంత. మనిషిలోంచి పశువు ఇంకా పోలేదు అనుకుంది. రోడ్డు మీద సీన్ క్రియేట్ చేసేట్టున్నాడని గ్రహించి ఆటోను పిలిచి తన హాస్టల్ అడ్రస్ చెప్పి పోనివ్వమంది. అది విన్నాడు నాగరాజు. ఆమె చేరుకునేలోపే హాస్టల్ గేట్ దగ్గర ప్రత్యక్షమై రోడ్డు మీద క్రియేట్ చేయబోయిన సీన్ అక్కడ క్రియేట్ చేశాడు. షాక్ అయింది శాంత. తన క్యారెక్టర్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. తనను చూసి కొట్టడానికి వచ్చాడు. వణికిపోయింది. తనను పరువుగా బతకనిచ్చేలా లేడనుకుంది శాంత. నానా యాగి చేసి వెళ్లిపోయాడు. తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే రాత్రంతా ఆలోచించింది శాంత. డీవీ యాక్ట్ లాయర్ని కలిసింది. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది శాంత. కోర్ట్ కూడా చాలా త్వరగా స్పందించింది. సెక్షన్ 18 ప్రకారం రక్షణ ఉత్తర్వులను పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీ ఒకటి తీసుకెళ్లి సంబంధిత పోలీసులకు ఇచ్చింది శాంత. ఇంకో కాపీ తను పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్‌కి, మరొకటి హాస్టల్ మేనేజర్‌కి ఇచ్చింది. ఇప్పుడు భర్త డిస్టర్బెన్స్, ఆ హింస, న్యూసెన్స్ లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. - సరస్వతి రమ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ అంటే... - ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com హింసలేని కుటుంబాల్లో మహిళలు ఆనందంగా బతకాలని రాజ్యాంగంలో మహిళా హక్కులకు సంబంధించి హామీ ఉంది. పెళ్లికాని, పెళ్లయిన స్త్రీలు, పెళ్లి లాంటి బంధంలో ఉన్న స్త్రీలకు ‘గృహహింస’నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన చట్టమే ‘డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 (గృహహింస నుంచి మహిళలకు రక్షణచట్టం)’. మహిళల మీద జరిగే అనేక హింసారూపాలను గుర్తించిన ఏకైక చట్టమిది. శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలనుంచి స్త్రీలకు రక్షణ కల్పించి తగిన ఉపశమనాలను, పరిష్కారాలను ఇస్తుంది. అవి... సెక్షన్ 18 .. రక్షణ ఉత్తర్వులు.. హింసను ఆపాలని, హింసించే పనులు చేయరాదని, మహిళ పనిచేసే చోటుకు వెళ్లరాదని, దారికాచి, ఆమె నివసించే ప్రదేశానికి వెళ్లి వేధించరాదని ఇచ్చే ఉత్తర్వులే రక్షణ ఉత్తర్వులు.. ప్రొటెక్షన్ ఆర్డర్స్. సెక్షన్ 19... మహిళను ఇంటినుంచి గెంటేయకుండా అంటే వెళ్లగొట్టకుండా ఇచ్చే ఉత్తర్వులు. వీటినే రెసిడెన్షియల్ ఆర్డర్స్ లేక నివాస ఉత్తర్వులు అంటారు. సెక్షన్ 20... జీవనభృతికి సంబంధించిన ఉత్తర్వులు.. అంటే మెయిన్టెనెన్స్ ఆర్డర్స్. సెక్షన్ 21... మైనర్ పిల్లల ఆధీనపు ఉత్తర్వులు అంటే కస్టడీ ఆర్డర్స్. సెక్షన్ 22... నష్టపరిహారపు ఉత్తర్వులు.. మానసికంగా వేధించినందుకు, హింసించినందుకు పొందే కాంపెన్సేషన్ ఆర్డర్స్. గృహహింస చట్టం సివిల్ చట్టం. జిల్లా మహిళాశిశు సంక్షేమశాఖ వారిని సంప్రదించి అక్కడే ఫిర్యాదు నమోదు చేయించుకోవాలి. ‘ప్రొటెక్షన్ ఆర్డర్స్’ కేసు నమోదు చేయడంలో సహాయపడి... కోర్ట్‌కు పంపి విచారణ ప్రారంభమయ్యేలా చేస్తారు. కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో దేన్నయినా ప్రతివాదులు ఉల్లంఘిస్తే అప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. -
భర్తే శత్రువై బాధిస్తే..!
మ్యారేజ్ కౌన్సెలింగ్ భార్యా రూపవతి శత్రుః అన్నారు. భార్య అందంగా ఉన్నా, తన కన్నా మంచి ఉద్యోగంలో ఉన్నా కొంతమంది భర్తల్లో ఆత్మన్యూనతాభావం మొదలౌతుంది. ఆ న్యూనత లోంచి అనుమానం మొదలౌతుంది. ఆ అనుమానంతో భార్యను శత్రువుగా భావిస్తారు. మాటలతో హింసిస్తారు. దౌర్జన్యం చేస్తారు. చివరికి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీయాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సెషన్స్ కోర్టును ఆశ్రయించి బాధిత మహిళలు న్యాయాన్ని, రక్షణను పొందవచ్చు. మాది ప్రేమ వివాహం. మా కులాలు వేరు కావడం వల్ల ఇంటిలోని వాళ్లు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్లు మా కాపురం సజావుగానే సాగింది. అయితే ఉద్యోగంలోనూ, అందంలోనూ నేను అతనికన్నా ఒక మెట్టుపైనే ఉండటం వల్ల తనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది. దాంతో నాపై అసూయతో నన్ను చిత్రహింసల పాలు చేశారు. దాంతో నేను గత కొద్ది కాలంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అయితే ఒక రోజు ఆయన బాగా తాగి నేను ఉంటున్న హాస్టల్‌కు వచ్చి, నన్ను నా కులం పేరుతో దూషించి, అందరి ముందు అవమానించాడు. దాంతో నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక నేను అతనితో కాపురం చెయ్యదలచుకోలేదు. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. - నిర్మల, ఆదిలాబాద్ మీ బాధ అర్థమైంది. మీకు రెండు మార్గాలున్నాయి. గృహహింస నిరోధక చట్టం 18ని అనుసరించి పిటిషన్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందటం, అంటే మీ వద్దకు వచ్చి దూషించకుండా, మీ ఆఫీస్‌కు లేదా హాస్టల్‌కు రాకుండా, దారికాచి వేధించకుండా ఆర్డర్స్ పొందవచ్చు. ఇంకోమార్గం..మీరు ఎస్సీ అంటున్నారు కదా, షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం ఎస్సీఎస్టీలకు చెందిన వారిని కులం పేరుతో దూషించినా, బహిరంగ ప్రదేశాల్లో అవమానించినా, మహిళలను దూషించినా, అవమానపరచాలనే ఉద్దేశ్యంతో దౌర్జన్యం చేసినా, బలప్రయోగం చేసినా, లైంగిక దాడికి గురి చేసినా, వెట్టిచాకిరీ చేయించినా, వివస్త్రను చేసినా, సంస్కారహీనంగా ప్రవర్తించినా, అసహ్యకర ద్రవపదార్థాలు తాగించినా, తినిపించినా అవి తీవ్ర నేరాలవుతాయి. వారికి ఆర్నెల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించబడుతుంది. మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఈ చట్టం కింద కేసులు వేయాలంటే స్పెషల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాలి. నా వయసు 75, నా భార్యకు 70 ఏళ్లు. మాకు సంతానం లేదు. కొద్దిపాటి ఆస్తి ఉంది. ఈ వయసులో మాకు సేవ చేసి, మా అవసరాలు తీర్చే వారెవరూ లేక, మాకు దూరపు బంధువైన ఒకరిని నమ్మి, మా అద్దె ఇళ్ల నుంచి వచ్చే ఆదాయంలో కొంత అతనుంచుకుని, మా ఆలనాపాలనా చూసుకోవలసిందిగా కాగితం రాసిచ్చాము. కొన్ని నెలలు మమ్ములను బాగానే చూసుకున్నాడు. తరువాత ఒకరోజు తీర్థయాత్రలకని నన్నూ, నా భార్యనూ కారులో ఎక్కించుకుని వెళ్లి, మమ్ములను ఒక ఊరి బయట దింపి, ఇప్పుడే వస్తానని చెప్పి, ఎక్కడికో వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దాంతో మేము ఎలాగో మా వూరు చేరుకున్నాము. జీవిత చరమాంకంలో ఉన్న మేము ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - వి.ఆర్. నూజివీడు మీరు ఏ కాగితం రాసుకున్నారో స్పష్టంగా లేదు. ఒకవేళ అదేమైనా అగ్రిమెంట్ అయినట్లయితే దానిని మీరు రద్దు చేసుకోవచ్చు. లేకుంటే బహుమతి రూపంలో కాని, మరే విధంగా గానీ ఆస్తి మార్పిడి చేసి ఉంటే మీరు వయోవృద్ధులు కనుక తలిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం ఆ ఆస్తి మార్పిడి లేక బహుమతిని చెల్లనివిగా ప్రకటించవలసిందిగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చును. ఈ చట్టానికి సంబంధించిన కేసులను మాత్రమే విచారించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఈ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఒక వయోవృద్ధుడు తనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, భౌతిక అవసరాలు తీరుస్తాడనే షరతుకు లోబడి ఒక వ్యక్తికి తన ఆస్తిని/ఆదాయాన్ని బహుమతి రూపంలో గానీ, మరోవిధంగా గానీ అప్పగించినట్లయితే, ఆ ఆస్తిని లేదా ఆదాయాన్ని పొందిన వ్యక్తి వారి ఆలనాపాలన చూడడంలో విఫలమైనప్పుడు ఆస్తి మోసపూరితంగా / బలవంతంగా పొందినట్లు భావించబడి, సదరు ఆస్తిమార్పిడి చెల్లనిదిగా ప్రకటించే అధికారం ఆ ట్రిబ్యునల్‌కు ఉంది. సెక్షన్ 24 ప్రకారం వయోవృద్ధులను నిరాదరణకు గురి చేసినందుకు, వదిలి వేసినందుకు, జైలుశిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. మీరు ఆ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించండి. ఇటీవలి కాలంలో ర్యాగింగ్ ఎక్కువై, ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు మానేస్తున్నారు. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. మా కాలేజీలో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా మేమొక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌గా ఏర్పడాలని అనుకుంటున్నాము. దయచేసి ర్యాగింగ్ చట్టం గురించి కాస్త వివరించండి. - రాధిక, భీమవరం ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం 1977 ప్రకారం బుద్ధిపూర్వకంగా ఒక విద్యార్థిని అవమానించినా, ఏడిపించినా, భయభ్రాంతులకు గురి చేసినా, బెదిరించినా, గాయపరిచినా, నిర్బంధించినా, అత్యాచార యత్నం చేసినా, అసహజమైన లైంగిక చర్యలకు లోను చే సినా, ఆత్మహత్యకు ప్రేరేపించినా, అది ర్యాగింగ్ కిందకు వస్తుంది. వీటికి ర్యాగింగ్ తీవ్రతను బట్టి 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. జైలుశిక్ష పడిన విద్యార్థిని కాలేజీ నుంచి తొలగించడం, మరే కాలేజీలో చేరకుండా ఉత్తర్వులివ్వడం జరుగుతుంది. యాజమాన్యం విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ర్యాగింగ్‌ను ప్రోత్సహించినందుకు చట్టప్రకారం వారు కూడా శిక్షార్హులవుతారు. దీనికి సంబంధించి రాఘవన్ కమిటీ, యు.జి.సి; సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. ఆల్ ది బెస్ట్. -
సోమ్నాథ్పై గృహహింస ఫిర్యాదు
ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన భార్య న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో న్యాయ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ అరెస్టు, రాజీనామా ఉదంతం జరిగి 24గంటలైనా కాకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక గృహహింస చట్టం కింద ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)లో బుధవారం ఫిర్యాదు చేశారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు జూన్ 26లోగా తమ ముందు హాజరై సమాధానం చెప్పాలని డీసీడబ్ల్యూ సోమ్‌నాథ్‌కు నోటీసు ఇచ్చింది. భర్త, ఆయన అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని లిపిక చెప్పారు. 2010 నుంచీ సోమ్‌నాథ్ ఆమెను వేధిస్తున్నారని.. ఇక ఈ వేధింపులకు ముగింపు పలకాలని లిపిక భావిస్తున్నారని డీసీడబ్ల్యూ చైర్పర్సన్ బర్ఖాసింగ్ అన్నారు. మూడేళ్లుగా లిపిక సోమ్‌నాథ్‌కు దూరంగా విడిగా ఉంటున్నప్పటికీ, ఆయన ఆమె దగ్గరకు వచ్చిపోతున్నారని బర్ఖా చెప్పారు. 2010 నుంచి సోమ్‌నాథ్‌తో గడ్డుకాలాన్ని అనుభవించానని, వివాహ బంధం నుంచి విముక్తి కోరుకుంటున్నానని లిపిక చెప్పారు. -
చెయ్యెత్తితే ఖబడ్దార్!
గృహహింస చట్టం మహిళలకు వరం ‘498 ఎ’ కన్నా ఎక్కువ రక్షణ అమలుకు ప్రత్యేక యంత్రాంగం మరింత అవగాహన అవసరం అతివలకు అడుగడుగునా అవరోధాలే. ఇంటా బయటా వేధింపులే. ఇది అనాదిగా వస్తున్న దురవస్థ. ఒకవిధంగా ఆలోచిస్తే బయటి సమస్యల కన్నా ఇంట్లోని పరిస్థితులే వారిని మరింత కుంగదీస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడానికి రూపొందించిన గృహహింస చట్టం ఇప్పుడిప్పుడే తన ప్రతాపం చూపిస్తోంది. వేధించేవారి వెన్నులో వణుకు పుట్టి ఇది అతివలకు మరింతగా ఉపయోగపడాలంటే ఈ చట్టం గురించి విస్తృత ప్రచారం జరగాలి. అవగాహన పెరగాలి. విశాఖపట్నం : గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన చట్టం మహిళలకు వరం. గృహహింస నివారణ చట్టం 2005-06 అక్టోబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్-43తో ఈ చట్టాన్ని తయారు చేసింది. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాల వల్ల సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ, పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. దుర్భర పరిస్ధితులు ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. చాలామంది మద్యానికి బానిసై కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలలోని మహిళలు కూడా ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి సంపాదనను కూడా మద్యం కోసం దుబారా చేసే మగపుంగవులు కోకొల్లలు. మద్యం మత్తులో భార్య, కుమార్తెలను ఇష్టానుసారంగా హింసించే మగ రాక్షసులకు కటకటాల వెనక్కినెట్టడమే కాకుండా మస్తుగా జరిమానాలు కూడా వడ్డించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. గృహహింస.. శారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను, లైంగికంగాను హింస పెట్టడం గృహహింస కిందకే వస్తుంది. ఇంకా బెదిరించడం, భయపెట్టడం దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే చర్యలు కూడా గృహహింసకు సంబంధించినవిగానే పరిగణిస్తారు. చట్టం పరిధి.. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య... భార్యభర్తల సంబంధంతోపాటు ఇతర సంబంధాలు కూడా వర్తిస్తాయి. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసివుంటున్నవారు, ఒకే ఇంటిలో కలిసి నివసించే స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. గృహహింసకు గురయినపుడు సంబంధిత మహిళ లేదా ఆమె తరపు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. అమలు పరిచే వ్యవస్థ రక్షణ అధికారి, న్యాయ సేవల అధికారి, సేవలు అందించే స్వచ్ఛంద సంస్ధలు, ఆశ్రయం అందించే సంస్ధలు, పోలీస్ అధికారి ఈ చట్టాన్ని అమలుపరుస్తారు. జిల్లాలలోని మహిళా, శిశు అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డెరైక్టర్లను ఈ చట్టం కింద రక్షణ అధికారులుగా నియమించారు. ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సంబంధింత న్యాయమూర్తి దరఖాస్తు అందిన మూడు రోజులలోగా మొదటి వాదన వినాలి. వాదోపవాదాలు విన్న తరువాత 60 రోజులలోగా తుది తీర్పు ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే ప్రతివాదులకు ఏడాది జైలుశిక్షతోపాటు 20 వేల రూపాయల జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రవాస వంచకులతో ఇబ్బందులు.. ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకుని మోసపోయిన మహిళలను గృహహింస చట్టం కూడా ఆదుకోలేకపోతుంది. కేసు వేసినా ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఆయా దేశాలలో నివసిస్తున్న వీరి భర్తలకు సమన్లు అందడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. సమన్లు అందినా కోర్టుకి రాకుండా కాలయాపన చేస్తుండటంతో బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ముందు, వెనుక చూడకుండా లక్షలాది రూపాయల కట్నం, ఇతర లాంఛనాలతో పెద్ద ఎత్తున వివాహలు జరిపిస్తున్నారు. తీరా కొద్ది కాలానికే తమ కుమార్తె పుట్టింటికి చేరుకోవడంతో తల్లిదండ్రులను అంతులేని ఆవేదన మిగులుతుంది. పోనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహహింస నివారణ చట్టం 2005 కింద న్యాయం జరుగుతుందేమోనని ఫిర్యాదు చేసినా పరిష్కారం మాట దేవుడెరుగు, సమన్లు పంపడానికే పడరానిపాట్లు పడాల్సివస్తోంది. నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-9లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్ధ కార్యాలయంలో ఉమెన్‌సెల్ పనిచేస్తోంది. సంస్ధ ప్రాజెక్ట్ డెరైక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో ఒక లీగల్ ఆఫీసర్, ఒక కౌన్సిలర్, మరో ఇద్దరు అసిస్టెంట్ కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరు బాధితుల నుంచి ముందుగా ఫిర్యాదు తీసుకుంటారు. త రువాత సంబంధీకులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తారు. రాజీ కుదరకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. కోర్టులో న్యాయమూర్తి బాధిత మహిళలకు మధ్యంతర భృతి, తరువాత భరణం మంజూరు చేస్తుంటారు. చట్టంలోని నిబంధల ప్రకారం కేసుని 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈసెల్‌లో ఎన్ఆర్ఐ కేసులు 20 కావడం గమనార్హం. మొత్తం కేసులు... 2006 నుంచి 2015 జనవరి వరకు ఉమెన్ సెల్లో మొత్తం 1447 కేసులు నమోదు కాగా అందులో 273 కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. కోర్టులో సెటిల్ అయినవి 381 కేసులు కాగా, కోర్టులో 793 ప్రోసెస్‌లో ఉన్నాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయండి.... గృహహింసకు గురయ్యే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. బాధితులు నేరుగా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన అనంతరం ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పిస్తాం. చట్టపరంగా సహయం, ఉచిత న్యాయసేవలు, ఆర్ధికసాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం, వైద్యసహాయం వంటివి బాధిత మహిళలకు అందజేస్తాం. కోర్టు కేసు విచారణ తెలిపే నోటీసును ప్రతివాదికి అందజేస్తాం. స్వచ్ఛంద సంస్ధల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి, చట్టప్రకారం వ్యవహరిస్తాం. జిల్లాలోని బాధిత మహిళలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ఆర్ఐ కేసులు ఉన్నాయి. అడ్రస్ లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తోంది. -బి.డి.జ్యోతిలత , కౌన్సిలర్ ప్రొటెక్షన్ సెల్, డీఆర్డీఏ కాంప్లెక్స్, సెక్టార్-9, ఎంవీపీ కాలనీ, ఫోన్: 0891-270615 -
కాపురాల్లో కార్చిచ్చు
రెండు హృదయాలు, మూడుముళ్లు, ఏడడుగులు.. నూరేళ్లపాటు భార్యాభర్తల బంధాన్ని కలిపి ఉంచుతాయి. నాతిచరామి అంటూ ప్రమాణం చేసింది మొదలు పెళ్లిపుస్తకంలోని చివరిపేజీ వరకు నమ్మక మే వివాహజీవితాన్ని నడిపిస్తుంది. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకే ఆదర్శం అయింది. మారుతున్న కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కారణాలేవైనా చాలా ఇళ్లలో చీటికీమాటికీ గొడవలు ప్రశాంతతను చెదరగొడుతుంటాయి. చివరకు అది పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేవరకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం తెచ్చింది. ఇది అమలులో విఫలమవుతోంది. చట్టం దుర్వినియోగం కూడా అవుతోందనే విమర్శలున్నాయి. కొన్ని చిక్కులను కూడా తెచ్చిపెడుతోంది. భర్త వేధింపులకు పాల్పడితే అతడి కుటుంబ సభ్యులకూ పోలీసు కేసు తప్పడం లేదు. ఈ క్రమంలోనే మగాళ్లు మృగాళ్లుగా మారిన సంద ర్భాలు ఉన్నాయి. దీనిపై కథనం.. మానవ త్వం కోల్పోయి భార్యలను చిత్రహింసలకు గురిచేసే భర్తల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల కిందట గృహ హింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. భార్యలను చీటికీమాటికీ కొడుతూ వేధింపులకు గురిచేసే భర్తలకు చట్టం ద్వారా గుణపాఠం చెప్పాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. చట్టం వచ్చిన కొత్తలో మహిళలకు ఇది రక్షణ కవచంలా మారింది. రానురాను అనేకమంది మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు వస్తే పెద్ద మనుషులు పంచాయతీ చేసి కాపురాలు కూలిపోకుండా కాపాడేవారు. అనంతరం పోలీస్‌శాఖ కుటుంబ కలహాలను పరిష్కరించేందుకు స్వచ్ఛంద సేవకుల ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నాళ్లు బ్రహ్మాండంగా కొనసాగిన ఈ సెంటర్లు ఇప్పుడు ఒకటి రెండు సబ్డివిజన్లలో మినహా ఎక్కడా కనిపించడంలేదు. మనస్పర్ధలు, ఇతర గొడవలతో స్టేషన్లకు వచ్చే భార్యాభర్తలకు రెండుమూడు వారాల పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి అప్పటికీ వారి మధ్య సఖ్యత కుదరకపోతే అప్పుడు గృహహింస చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే కొందరు పోలీస్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. భార్య ఆవేశంలో వచ్చి ఫిర్యాదు చేయగానే భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరుదులపై ఫిర్యాదులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు విషయంలో భర్తకు తప్ప మిగతావారికి సంబంధం లేదని తేలినప్పటికీ తమ జేబులు నింపితేనే కేసులో నుంచి మిమ్మల్ని తప్పిస్తామంటూ నేరుగా చెబుతున్నారు. చేసేది లేక వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన గృహహింస చట్టం కొందరు పోలీస్ అధికారులకు ఆదాయ వనరుగా మారింది. మృగాళ్లుగా మారి.. గృహహింస నిరోధక చట్టం ద్వారా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కని అటు భార్యా పిల్లలకు.. ఇటు తల్లిదండ్రులు, అక్కా తమ్ముళ్ళకు దూరమై మానసికంగా దెబ్బతిన్న అనేకమంది దారుణాలకు తెగబడుతున్న వైనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సంచలనం కలిగించిన పలు హత్యల ఉదంతాలను పరిశీలిస్తే ఇలాంటి నిజాలే బట్టబయలవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల ద్వారా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలను సద్దుమణచాల్సింది పోయి కొందరు అధికారులు వారి స్వలాభం కోసం వాటిని పెంచి పెద్దవి చేస్తూ వారి కాపురంలో నిప్పులు పోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
స్త్రీ విముక్తి కోసం పోరుబాట
మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలని గత ఏడాదిలో ఐరాస పిలుపునిచ్చింది. కాని కాశ్మీర్ ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృధా ప్రయాసే. స్త్రీ శ్రమశక్తికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. పురుషులతోపాటు తమ శ్రమశక్తిని సమానంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ అమెరికా, రష్యాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సార్వత్రిక సమ్మెలలో పాల్గొని పోరాటాలు చేశారు. వీటిని గమనంలో ఉంచుకుని మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆ విధంగా గత 104 సంవత్సరాలుగా మార్చి 8న స్త్రీ-పురుష సమాన హక్కుల పోరాటానికి సంకేతంగా, మహిళా విముక్తి సంకల్ప దినంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకుంటున్నారు. మన ఇరుగుపొరుగు దేశాలు ఈ రోజును సెలవు దినంగా ప్రకటించి అమలుపరుస్తున్నప్పటికీ భారతదేశంలోని రాజకీయపార్టీల నేతలకు మహిళల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు ఇటీవలే 15వ లోక్‌సభ పదవీ కాలం ముగిసినప్పటికీ మహిళలకు 33వ శాతం రిజర్వేషన్ బిల్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మార్క్స్ నేతృత్వం కార్ల్ మార్క్స్ నాయకత్వాన 1864లో ప్రారంభించిన మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్త్రీ శ్రమశక్తి సామాజిక గుర్తింపు పొందడానికి, పారిశ్రామిక ఉత్పత్తిలో వారి భాగస్వామ్యం పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. 1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో తొలి అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన శ్రామిక మహిళలతో సమన్వయ సంఘం ఏర్పరచి మహిళలందరికీ ఓటు హక్కు డిమాండ్ చేసింది. తర్వాత లెనిన్ చొరవతో రెండవ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా ప్రకటించింది. అనంతరం 1911 మార్చి 8న మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు దేశాలలో జరుపుకున్నారు. అన్నింటా అణచివేతే ప్రపంచీకరణ యుగంలో మహిళా శ్రమశక్తిని అనేకమంది పారిశ్రామికవేత్తలు కొల్లగొడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం ద్వారా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ పద్ధతిలో మహిళలను, పిల్లలను తీసుకుని వారికి శ్రమకు తగినవిధంగా వేతనం చెల్లించని పరిస్థితులు ఉన్నాయి. బీడీ రంగంతోపాటు నిర్మాణ పనులు, సేవా రంగం, అసంఘటిత రంగాలలో అధిక సంఖ్యలో మహిళా శ్రామికులను వినియోగిస్తున్నారు. చదువులు, కుటుంబ నిర్వహణ, సామాజిక ఉత్పత్తి రంగాల్లో ఎంతో ప్రావీణ్యత కలిగినా మహిళలను అన్ని కీలక రంగాల నుంచి తప్పిస్తున్నారు. కొన్ని రంగాలలో పురుషాధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో కూడా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు తమ మేధస్సుతో, పట్టుదలతో దూసుకుపోతున్నారు. పితృస్వామ్య భావజాలానికి ఎదురీది స్వతంత్ర ధోరణితో ఎదిగి రాజకీయ రంగంలో స్థిరపడిన వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్ పార్లమెంట్లో మహిళా ఎంపీల సంఖ్య 11 శాతానికి మించదు. ఈ విషయంలో మనం పొరుగున ఉన్న పాకిస్థాన్ కన్నా వెనుకబడి ఉన్నామని చెపితే విస్మయం కలుగుతుంది. 1975-85 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దిగా ప్రకటించింది. స్త్రీలపై అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరుకు కంకణబద్ధులు కావాలంటూ గత ఏడాదిలో పిలుపునిచ్చింది. కాని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా పోలీసు, సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృథా ప్రయాసే అవుతుంది. ఈచట్టాలను ఎత్తివేయాలని స్త్రీలు నగ్నంగా నిరసన తెలుపుతున్నా, మణిపూర్‌లో గత 14 ఏళ్లుగా షర్మిల చాను అనే మహిళ ఉక్కు సంకల్పంతో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ పాలకులకు చీమ కుట్టిన ట్లయినా లేదు. అందువల్ల వ్యవస్థీకృతమైన అణచివేత, దోపిడీ, వివక్షలను రూపుమాపడానికి మహిళలు ఇతర పీడిత వర్గాలతో భుజం, భుజం కలిపి పోరాడవలసి ఉంది. సంక్షేమ పథకాల తాయిలాలతో సంతృప్తిపడకుండా అన్ని రంగాల్లో సగభాగం వాటా చెందాలన్న సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ సమసమాజ స్థాపన దిశగా సాగాలి. ఆకాశంలో మేము సగమంటున్న మహిళల నినాదం నిజం కావడానికి సంఘర్షిద్దాం. (రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం) అమర్ (జనశక్తి) -
సహజీవనాన్ని గుర్తించండి!
-
సహజీవనాన్ని గుర్తించండి!
పార్లమెంటుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం(లివ్ఇన్ రిలేషన్షిప్) నేరమో, పాపమో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సహజీవనంలో ఉన్న మహిళలు, వారి పిల్లల రక్షణ కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని గురువారం పార్లమెంటును ఆదేశించింది. సహజీవనాన్ని పార్లమెంటు గుర్తించాల్సి ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘దురదృష్టవశాత్తూ ఇలాంటి సంబంధాలు సంప్రదాయ వివాహాలు కాకపోవడం, చట్టం వాటిని గుర్తించకపోవడం వల్ల.. వాటిని క్రమబద్ధీకరించే స్పష్టమైన చట్టమేదీ లేదు’ అని వ్యాఖ్యానించింది. గృహహింస చట్టంలో పేర్కొన్న ‘ వైవాహిక సంబంధం’ పరిధిలోనే ఈ సహజీవనాన్ని చేర్చే విధంగా పలుమార్గదర్శకాలను ధర్మాసనం పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై పార్లమెంటు మరింత లోతుగా ఆలోచించి మరో చట్టాన్ని తీసుకురావడమో, లేక ప్రస్తుతం ఉన్న సంబంధిత చట్టాన్ని సవరించడమో చేయాలని సూచించింది. ‘మన దేశంలో సమాజం అంగీకరించనప్పటికీ సహజీవనం పాపమో, నేరమో కాదు. వివాహం చేసుకోవాలా, వద్దా లేక వివాహం చేసుకోకుండా స్త్రీ, పురుషులు సహజీవనం గడపాలా.. అనేవి సంపూర్ణంగా వారివారి వ్యక్తిగత విషయాలు’ అని పేర్కొంది. ‘ఈ సంబంధాల్లో కూడా స్త్రీ, పురుషులు విడిపోయిన తరువాత సాధారణంగా మహిళే కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. అందువల్ల వారిని, ఆ సహజీవనం వల్ల జన్మించిన పిల్లలను రక్షించే లక్ష్యంతో ఒక చట్టాన్ని రూపొందించాలి’ అని వివరించింది. అయితే, ఆ చట్టం వివాహ పూర్వ శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని హెచ్చరించింది. అలాగే, ప్రతిపాదిత చట్టం రక్షణ కల్పించే ‘సహజీవనం’ పరిధిలో.. అక్రమ సంబంధాలు రాకూడదని సూచించింది. ఈ సహజీవనాన్ని అనేక దేశాలు గుర్తిస్తున్నాయని, మనం కూడా గుర్తించాల్సి ఉందని పేర్కొంది. పలు దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది. సహజీవనాన్ని నిర్ధారించే క్రమంలో.. వారిరువురు ఎంతకాలంగా కలిసి ఉన్నారు?, పిల్లలు ఉన్నారా?, ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించారు?, సమాజంతో సంబంధాలు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంటును కోరింది. తనతో సహజీవనం గడిపిన వ్యక్తి నుంచి భరణం కోరుతూ ఒక మహిళ కోర్టును ఆశ్రయించిన కేసుపై తీర్పునిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.