
జూడాలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు సోమవారం స్పందించింది. విధులను బహ్కిరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది.
జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారని, దీనివల్ల రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన బి.రవికిరణ్ స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం జూనియర్ డాక్టర్ల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.