సాక్షి, హైదరాబాద్: కొత్త సినిమా విడుదలైన ప్రారంభంలో నిర్ణీత కాలానికి సినిమా టికెట్ల ధరల పెంపునకు సింగిల్ జడ్జికి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందిన ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సినిమా విడుదలైన కొత్తలో అధిక వసూళ్లకు వీలుగా కొన్ని వారాలపాటు టికెట్ల ధరల పెంపునకు జగిత్యాలలోని దుర్గా రాజా కళామందిర్ గతేడాది సింగిల్ జడ్జి కోర్టులో ఉత్తర్వులు పొందింది.
ఈ ఉత్తర్వులను సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం కార్యదర్శి వేణుగోపాల్‌రావు సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ టి.రజినీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. దుర్గా రాజా కళామందిర్ థియేటర్ పొందిన ఆ ఉత్తర్వుల అమలుపై స్టే విధించిన ధర్మాసనం.. కోర్టుకు తప్పుడు వివరాలు ఇవ్వడంపైన థియేటర్ యాజమాన్యం కౌంటర్ పిటిషన్ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సదరు థియేటర్‌కు మాత్రమే వర్తించబోవని ధర్మాసనం స్పష్టం చేసింది.
సినిమా టికెట్ల ధర పెంపు ఉత్తర్వులపై హైకోర్టు స్టే
Published Thu, Jul 6 2017 3:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement