
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎలక్ట్రో మెకానికల్ పరికరాల ధరల పెంపుపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై వీలునుబట్టి వచ్చే వారం లేదా తరువాత వారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తాను దాఖలు చేసిన వ్యాజ్యం మంగళవారం నాటి విచారణ జాబితాలో ఉన్నప్పటికీ, విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో నాగం మంగళవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
ఈ వ్యాజ్యంలో ప్రభు త్వం కౌంటర్ దాఖలు చేసిందని, ఆ కౌంటర్‌కు తాను స మాధానం కూడా ఇచ్చానని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ధర్మాసనం, ఇప్పటికిప్పుడు విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.