పాతబస్తీలో ఉద్రిక్తత | high tension in old city of hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో ఉద్రిక్తత

Published Fri, Apr 10 2015 4:34 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

పాతబస్తీలో ఉద్రిక్తత - Sakshi

పాతబస్తీలో ఉద్రిక్తత

చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత గుంపులుగా వచ్చిన కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మీర్‌చౌక్ ఏసీపీ గంగాధర్‌కు గాయాలయ్యాయి. అంతేకాకుండా మెఘల్‌పూరా పోలీస్ ఔట్ పోస్ట్‌పై 500 మంది దాడిచేసినట్లు సమాచారం. మెఘల్‌పూరా, సుల్తాన్‌షాహీల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినా ఆందోళనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement