సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌! | Highlights Of CM KCR's Visit To Chinthamadaka Village | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

Published Tue, Jul 23 2019 8:12 AM | Last Updated on Tue, Jul 23 2019 8:12 AM

Highlights Of CM KCR's Visit To Chinthamadaka Village - Sakshi

హరీశ్‌రావుతో..

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం తాను పుట్టిన ఊరు చింతమడకలో సుమారు 4 గంటల పాటు పర్యటించారు. గ్రామం అభివృద్ది కోసం భవిష్యత్‌ ప్రణాళికను రూపోందించిన అయన ఉదయం మద్యాహ్నం 12–40 నిమిషాలకు గ్రామానికి చేరుకుని సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు తిరిగి ప్రయాణం అయ్యారు. వాటికి సంబంధించి హైలైట్స్‌ కొన్ని. 

  •  సీఎం కేసీఆర్‌ 2 గంటల పాటు ఆలస్యంగా చింతమడకకు చేరుకున్నారు.  
  •  హెలిప్యాడ్‌ వద్ద సీఎం కేసీఆర్‌కు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, కేసీఆర్‌ చిన్నాన్న బాలకిషన్‌రావులు, పుష్పగుచ్చాలు ఇచ్చిస్వాగతం పలికారు.  
  •  సభ వేదికకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ వేదికపైకి వెళ్లకుండా నేరుగా గ్రామ ప్రజలు కూర్చున గ్యాలరీ వద్దకు చేరుకుని ప్రతీ ఒక్కరికి చేతులు జోడిస్తూ అప్యాయంగా ప్రేమతో పలకరించారు. ఈ       సందర్బంగా పలువురు మహిళలు, బాల్యమిత్రులు కేసీఆర్‌ను ఆప్యాయంగా చిరునవ్వుతో,చప్పట్లతో ఆశీర్వరించారు.  
  •  వేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ వేదికపైన ఉన్న ఎమ్మెల్యేలను,ఎమ్మెల్సీలను, ఎంపీలను, పలకరించారు. అక్కడే ఉన్న తన చిన్నాన బాలకిషన్‌రావును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని   ఆయనకు పాధాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.  
  •  సభ ప్రారంభం కంటే ముందు మాజీమంత్రి, హరీష్‌రావు మాట్లాడుతూ తన ప్రసంగంలో కేసీఆర్‌ను పలు నిదులు కావాలని ప్రేమగా కోరడం విశేశం.  
  •  ముఖ్యంగా చింతమడకకు నిదులను కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌ అంతే ప్రేమతో మాచాపూర్, సీతారాంపల్లి, గ్రామాలకు కూడా నిదులు ఇవ్వాలని కోరగా స్పందించిన సీఎం గ్రామానికి  రూ.50లక్షల చొప్పున మంజూరు చేస్తున్నానని అదే విధంగా తాను చదువున్న  గ్రామాలు తోర్నాల, పుల్లూరు, గూడూరు, దుబ్బాకకు రూ. కోటి చొప్పున నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.  
  •  కొందరికి గ్రామంతో పేరువస్తుందని కాని సీఎం కేసీఆర్‌ వల్ల చింతమడకకు గొప్ప పేరు వచ్చిందంటూ హరీశ్‌ రావు అనగానే గ్రామస్తులంతా ఈలలు వేస్తూ చప్పట్లతో మద్దతు పలికారు.  
  •  సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే హరీష్‌రావు చింతమడక నిదులతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి, సిద్దిపేట మున్సిపల్‌కు నిధులను విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.  
  •  కేసీఆర్‌ ప్రసంగిస్తూ మాజీమంత్రి, హరీశ్‌రావును చిరంజీవిగా సంబోధించిన సమయంలో వేదిక కింది భాగాన పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలు వేస్తూ అభిమానులు గ్రామ ప్రజలు మద్దతు పలికారు. వారి ఉత్సాహాన్ని చూసి కేసీఆర్‌ ప్రసంగం మధ్యలో పలు మార్లు హరీశ్‌రావును అభినందిస్తూ ఒక మంచి నాయకుడు మీకు ఉన్నాడని ఆయన నాయకత్వలో పనిచేయాలంటూ సందేశం ఇచ్చారు. 
  •  తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన చింతమడక గ్రామానికి ఎంత చేసిన తక్కువేనని సీఎం అనడంతో సభలో పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు పలికారు.  
  •  సీఎం కేసీఆర్‌ సభ ఆద్యాంతం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని ప్రశంసించారు. ఎర్రవల్లిని గోప్పగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని రేపు చింతమడకను అభివృద్ధి చేసేది కూడా కలెక్టరే ఉంటూ వాఖ్యలు చేశారు.  
  •  సీఎం ప్రసంగం మధ్యలో జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి లేచి ఒక చిన్న చిట్టిని కేసీఆర్‌కు అందించడం దానిని చూసి చదివిన కేసీఆర్‌ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్ల విస్తరణకు, గ్రామప్రజలు సహాకరించాలని, ప్రతీ ఒక్కరు ఓర్పుతో, సమష్టిగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సందేశం ఇచ్చారు.  
  •  సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గ్రామం మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డుల వారిగా పోలీసులు అనుమతించారు. ఇతర గ్రామాలకు చెందిన వారిని గుర్తింపు కార్డు లేనివారిని గ్రామంలోకి, సభ వేదికవైపు వెళ్లకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.  
  •  సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో వస్తున్నప్పటికి ముందస్తు జాగ్రత్తగా సిద్దిపేట నుండి చింతమడక వరకు రహదారికి ఇరువైపులా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  
  •  సీఎం గ్రామ పర్యటన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ నివాస గృహాలను వివిధ రకాల పూలతో, మామిడి తోరణాలతో, రంగు రంగులతో ఇంటి ముందున్న వాకిట్లో వెల్‌కమ్‌ టు కేసీఆర్, స్వాగత తోరణాలు బతుకమ్మలతో ఆహ్వానాలు పండుగ సందడిని కనిపించాయి.  
  •  గ్రామంలోని పలుచోట్ల సీఎం కేసీఆర్‌కు చెందిన 50 ఫీట్ల భారీ కటౌట్లు ఆకర్షనీయంగా కనిపించాయి. మరోవైపు సీఎం గ్రామపర్యటన నేపథ్యంలో గ్రామంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో సీఎం, హరీశ్‌రావు, కేటీఆర్, కవితల కుటుంబ సభ్యులతో ఉన్న ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. 
  •  సభ అనంతరం గ్రామ మహిళలకు, పురుషులకు, అధికారులకు వేరువేరుగా ఏర్పాటు చేసిన షామియానాల్లో భోజనాలను ఏర్పాటు చేశారు.  
  •  సభ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.  
  •  సీఎం సభ వేదికకు చేరుకునే వరకు ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ తన ఆటపాటలతో  అందరిని ఉషారెత్తించారు. మరోవైపు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నృత్యాలు     అకట్టుకున్నాయి.  
  •  సభ అనంతరం కేసీఆర్‌ ప్రగతి రథం  బస్సులో ముందు భాగాన కూర్చుని ప్రతి ఒక్కరిని  అప్యాయంగా  చేతులతో   విజయ సంకేతం చూపిస్తూ  ముందుకు సాగారు.  
  •  సీఎం  కేసిఆర్‌ చింతమడక పర్యటనలో భాగంగా వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు మాజీ మంత్రి హరీశ్‌రావు  కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు.  
  •  సభ వేదికపైన పలుమార్లు సీఎం గ్రామ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళిక గూర్చి  కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి పలు సూచనలు, అందజేశారు.  
  •   సీఎం కేసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు,ఎంపీ, కలెక్టర్, ముఖ్యులు కలిసి భోజనం చేశారు.  
  •  సుమారు నాలుగుగంటల పర్యటన అనంతరం  సీఎం కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా ఎర్రవల్లికి బయలుదేరారు.       

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కలెక్టర్‌తో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement