భగ్గుమంటున్న భూముల ధరలు
► గజం ధర రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు
►భూపాలపల్లి నుంచి గణపురం వరకు వెంచర్లు
►నెల రోజుల్లోనే మూడింతలు పెరిగిన ధరలు
►జిల్లా ఏర్పాటు చర్చతో రియల్ బూమ్
భూపాలపల్లి: భూపాలపల్లిలో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలోనే భూముల ధర లు మూడింతలు పెరిగాయి. ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నా యి. పట్టణ శివారు నుంచి మొదలుకొని గణపురం క్రాస్‌రోడ్ వరకు రియల్ వ్యాపారులు తిష్టవేసి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నా రు. జిల్లాల పునర్విభజనపై గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు జరుపుతుంది. ఈ క్రమంలో భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి.. ఇందులో విలీనం చేయబోయే నియోజకవర్గాలపై చర్చ జరుగుతో ంది. జిల్లాగా ఏర్పడితే భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉం దని భావించిన కొందరు రియల్, వ్యాపారులు, భూస్వాములు గత కొద్ది రోజులుగా భూముల క్రయ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
మూడింతలు పెరిగిన గజం ధర..
భూపాలపల్లి నుంచి గణపురం వరకు గజం ధర నెల రోజుల వ్యవధిలోనే మూడింతలయింది. కొద్ది రోజుల క్రితం వరకు భూపాలపల్లి పట్టణంలోని పోలీస్‌స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం, బస్ డిపో సమీపాల్లో గజం ధర రూ. 3 వేల వరకు ఉండేది. కాగా ప్రస్తుతం ఆయా స్థలాల్లో గజం ధర రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు పలుకుతోంది. పట్టణ సరిహద్దు నుంచి చెల్పూరు వరకు గతంలో గజం ధర రూ. 3 వేలు మాత్రమే ఉండగా ప్రస్తుతం సుమారు రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకు ఉంది. ఇదిలా ఉండగా పట్టణం నుంచి చెల్పూరు వరకు భూముల ధరలు పెరిగిన విషయాన్ని గమనించిన కొందరు వ్యాపారులు, రైతులు గణపురం క్రాస్‌రోడ్ వద్ద వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అక్కడ ప్రస్తుతం గజం ధర రూ. 3 వేల వరకు పలుకుతోంది. భూపాలపల్లి, గణపురం మండల కేంద్రాల మధ్య గత ఏడాది క్రితం వరకు వ్యవసాయ భూములు దర్శనమిచ్చేవి.
కాగా ప్రస్తుతం ప్లాట్లు, భవనాలు కనిపిస్తున్నాయి. మరో ఏడాది వరకు రెండు మండలాల మధ్య ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు కనిపించే అవకాశాలు కానరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ బొగ్గు, విద్యుత్ రంగ పరిశ్రమలతో భూపాలపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటమే కాక జిల్లాగా ఏర్పడనున్నట్లు వార్తలు వస్తుండటంతో భూముల ధరలు సామాన్యుడికి అందకుండాపోతున్నాయి.