తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన హెల్త్ కార్డులతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఎక్కడా తమకు వైద్యం అందడం లేదని టీచర్ల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో టీచర్ల జేఏసీ నాయకులు గురువారం సమావేశమయ్యారు. తమకు పదో పీఆర్సీని 63 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలుచేయాలని డిమాండు చేశారు.
హెల్త్ కార్డులను తీసుకెళ్తే తమకు వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్యాకేజి రేట్లను సవరించి, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని.. వైద్యం అందించేలా చూడాలని కోరారు. ప్రతినెలా ప్రీమియం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీచర్ల జేఏసీ నాయకులు సీఎస్ రాజీవ్ శర్మకు తెలిపారు. సర్వీసు రూల్స్ లేని కారణంగా తమ పదోన్నతులు కూడా నిలిచిపోయాయని, వాటిని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు.
హెల్త్కార్డులతో వైద్యం అందట్లేదు: టీచర్ల జేఏసీ
Published Thu, Dec 11 2014 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement