భార్యను చంపిన భర్త | husband killed his wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Published Fri, Mar 6 2015 3:32 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

husband killed his wife

కరీంనగర్ : తాగిన మైకంలో భార్యను హత్య చేశాడో భర్త. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలోని వడ్డెర బస్తీలో జరిగింది. వివరాలు..బస్తీకి చెందిన దేవయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నర్సవ్వతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో తాజాగా శుక్రవారం తాగి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆగ్రహించిన అతని బావమరుదులు దేవయ్యను తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన దేవయ్యను జగిత్యాల ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా, నర్సవ్వ మరణానికి కుటుంబకలహాలే కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
(జగిత్యాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement