సాక్షి, హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో గురువారం జరిగిన మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో ప్రముఖ కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయని, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవిరళంగా కృషి చేస్తున్నదన్నారు. ఉపాధి అవకాశాల్లో యువతకు శిక్షణ కోసం ఐటీని వాడుకుంటున్నామని, పాఠశాల విద్యనుంచే శిక్షణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాలేజీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్య అభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment