ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు! | IB issues alert of possible terror attack on hyderabad IT corridors | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు!

Published Fri, Jun 9 2017 9:08 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు! - Sakshi

ఐటీ కంపెనీలకు ఉగ్రముప్పు!

హైదరాబాద్‌ : ఐటీ కారిడర్‌లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో  దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులు... హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను టార్గెట్‌ చేసినట్లు సమాచారంతో తెలంగాణ పోలీసులను ఐబీ అప్రమత్తం చేసింది.

దీంతో అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు  ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర చోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement