
హైదరాబాద్ జోన్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్‌గా అగర్వాల్
జీఎస్‌టీ కస్టమ్స్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇన్‌చార్జిగా కూడా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జోన్ (తెలంగాణ) జీఎస్‌టీ కస్టమ్స్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్‌టీ చట్టంలోని అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్‌టీపై దేశంలోని 60వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి చీఫ్ కమిషనర్‌గా, విశాఖపట్నం జోన్ (ఆంధ్రప్రదేశ్) ఇన్‌చార్జి చీఫ్ కమిషనర్‌గా కూడా వ్యవహరించనున్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ పన్ను చెల్లింపు దారుల సమస్యలు పరిష్కరించడం, వారి సందేహాలను నివృత్తి చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు.