ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్లు: కేటీఆర్
ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్లు: కేటీఆర్
Published Thu, Sep 25 2014 7:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, జిల్లా పరిధిలో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో పదిరోజుల్లోగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు వెల్లడించారు. నాస్ కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్, ఐటీ పరిశ్రమ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి.. ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ భద్రతకు పక్కా ప్రణాళికను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులున్నారని.. అందులో 25 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
Advertisement