
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాకను తానేమీ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ నాయకురాలు, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రాకను వ్యతిరేకించే వారు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘రేవంత్‌ను పార్టీలోకి చేర్చుకోవద్దని నేనెందుకంటాను.. ఆయనకు పదవులు ఇవ్వద్దని నేనెందుకంటాను.. హైకమాండ్ ఇస్తామంటే వద్దనే వారెవరుంటారు?..’అని డీకే అరుణ అన్నారు. కొడంగల్ ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదని.. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కూడా ఎన్నికలు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఒక్క కొడంగల్ ఎన్నిక మాత్రమే పెడుతామని కేసీఆర్ అంటే కుదరదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment