నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల | i-set schedule is releasing today | Sakshi
Sakshi News home page

నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల

Published Tue, Feb 24 2015 7:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

i-set schedule is releasing today

కరీంనగర్ : ఐసెట్-2015 షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేయనున్నారు.ఈసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. శాతవాహన యూనివర్సిటీ వీసీ కడారు వీరారెడ్డి కేయూ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసెట్ ఏర్పాట్లపై శాతవాహన యూనివర్సిటీ పరిపాలన విభాగంలో నేడు ఉన్నత స్థారుు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర ఉన్నతి మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్, ఐసెట్ కో-కన్వీనర్ ఓంప్రకాశ్, ఎస్‌యూ వీసీ వీరారెడ్డి, రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Photos

View all
Advertisement