టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు | If TRS Party Wins In Municipality Elections They Will Remove Rajanna Statue Says Bandi Sanjay | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు

Published Fri, Sep 20 2019 11:33 AM | Last Updated on Fri, Sep 20 2019 3:00 PM

If TRS Party Wins In Municipality Elections They Will Remove Rajanna Statue Says Bandi Sanjay - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌

సాక్షి, వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే.. యాదాద్రి తరహాలో వేములవాడలోనూ రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్‌ విగ్రహాన్ని పెట్టే ప్రమాదముందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు. సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. వేములవాడ నియోజకవర్గం నుంచి రెండువేల మంది బీజేపీలో చేరగా ఎంపీ బండిసంజయ్‌ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. 

వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో వేములవాడలో బీజేపీ జెండా ఎగురవేయకుంటే యాదాద్రి తరహాలో ఇక్కడా రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్‌ విగ్రహాన్ని పెట్టుకునే ప్రమాదముందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్‌లో గురువారం జరిగిన బీజేపీ సమావేశానికి హాజరయ్యారు.ఎంపీ మాట్లాడుతూ.. యాదా ద్రిలో దేవుళ్లు ఉండాల్సినస్థానాల్లో కేసీఆర్‌ బొమ్మలను పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు మేల్కొనకుంటే వేములవాడలోనూ ఇదే ప్రమాదం జరగనుందన్నారు. రమేశ్‌బాబును నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమాత్రం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.తన నిధులతో రాజన్నగుడిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. 

అక్రమాలు వెలికితీస్తా... 
టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు.కరీంనగర్‌ నియోజకవర్గంలో ఏడుగురు మంత్రులను నియమించుకున్నా... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భయపడేది లేదన్నారు. బీజేపీలో 2వేల మంది చేరిక వేములవాడ నియోజకవర్గంలోని ఏడుమండలాల నుంచి తరలివచ్చిన 2వేల మంది ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ ఎంపీ బండి సంజయ్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. బండి సంజయ్‌కి రైకనపాట క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో 200మంది యువకులు బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గోపు బాలరాజు, జిల్లా దళితమోర్చా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా ఇన్‌చార్జి రాంనాథ్, ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు.

గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పంపించారు.. 
వేములవాడరూరల్‌: గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పం పిన ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. వేములవాడ మండలంలోని చెక్కపల్లిలో బీజేపీ పార్టీజెండా ఆవిష్కరించారు. విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉన్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్‌ చేయించాడన్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికా రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement