
కోల్‌సిటీ (రామగుండం): తమ కొడుకు కశ్మీర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడనుకుంటున్న ఆ తల్లిదండ్రులు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర దగ్గర టాటాఏస్, పల్సర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించాడని తెలిసి షాక్‌కు గురయ్యారు. గోదావరిఖని గంగానగర్‌కు చెందిన కత్తెర్ల రాజయ్య మూడో కుమారుడైన శ్రీకాంత్ (21)కు నాలుగేళ్ల క్రితం ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. మూడు నెలల క్రితం కశ్మీర్ నుంచి సెలవుపై ఇంటికి వచ్చిన శ్రీకాంత్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.
ఆ తర్వాత తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీకాంత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కశ్మీర్‌లోనే ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర దగ్గర టాటా ఏస్, పల్సర్ ఢీకొన్న ప్రమాదంలో శ్రీకాంత్ మృతి చెందాడు. తాను డిగ్రీ చదువుకునేందుకు మిత్రులతో కలసి కరీంనగర్‌లో ఉంటున్నాడని స్థానికులు అంటున్నారు. డిగ్రీ పరీక్షల కోసమే విధులకు వెళ్లకుండా, ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కరీంనగర్‌లో ఉంటున్నాడని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment