మతలబు ఏంటో...
అసంపూర్తి పనులకూ బిల్లుల చెల్లింపులు
దెయ్యూలవాగు {బిడ్జి నిర్మాణంలో మాయ
నాణ్యతనూ పట్టించుకోని ఐటీడీఏ
అధికారుల తీరుపై అనుమానాలు
విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్
ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయాలను వివిధ పథకాల్లో కేటాయిస్తోం ది. ఈ నిధులు నీళ్లలా వ్యయమవుతున్నా... పనులు తూతూమంత్రంగానే కొనసాగుతున్నా యి. పనులను పర్యవేక్షించే శాఖలు మొక్కుబడిగా వ్యవహరించడంతో నాణ్యత కొరవడిం ది. ఇది చాలదన్నట్లు గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరో అడు గు ముందుకేశారు. అసంపూర్తిగా ఉన్న పనులకూ మొత్తం బిల్లులు చెల్లించి చోద్యం చూస్తున్నారు. ఇందుకు దయ్యాలవాగు వద్ద చేపట్టిన పనులే నిదర్శనంగా నిలుస్తున్నారుు. మూరుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఐఏపీ (సమగ్ర కార్యచరణ ప్రణాళిక) పథకంలో గిరిజన ప్రాంతాల్లోని రహదారులు, వాగులపై బ్రిడ్జిలను నిర్మించారు. ఇందులో భాగంగా దొడ్ల గ్రామ సమీపంలోని దయ్యాలవాగుపై రూ.5కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మించారు రూ.4కోట్లు బ్రిడ్జి కోసం కాగా, రూ.కోటితో అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేశారు.
అరుుతే ఈ బ్రిడ్జిని నిర్మించిన ప్రాంతం అనువైనది కాదనే అభిప్రాయాలు అప్పటికే వ్యక్తమయ్యూరుు. వాగుకు బ్రిడ్జి అభిముఖంగా ఉండడం వల్ల భారీ వర్షాలు పడితే వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుందని నాణ్యతా విభాగం అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోగా... సదరు కాంట్రాక్టర్‌పై ఎనలేని ప్రేమచూపించడం విమర్శలకు తావిస్తోంది. బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ మొత్తం బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో నజరనాలు ముట్టడంతోనే బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.
జాడ లేని రివిట్‌మెంటు
దొడ్ల- కొండాయి గ్రామాల మధ్య ఉన్న వాగుపై రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపుల రివిట్‌మెంట్ నిర్మించకపోవడం వల్ల దాని భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత సపోర్టు గోడలకు రాయితో రివిట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈపనులు చేపట్టిన కాంట్రాక్టర్ రివిట్‌మెంట్ చేసేందుకు రాయి తెచ్చినా.. పనులు చేయలేదు. నిర్లక్ష్యంగా వదిలివేసినప్పటికీ అధికారులు బిల్లులు చెల్లించారు. గత వర్షాకాలంలో కురిసిన కొద్ది పాటి వర్షాలకే బ్రిడ్జి ఇరుపక్కల ఉన్న ఒడ్డు కోతకు గురైంది.
అసంపూర్తిగా అప్రోచ్ రోడ్డు
దొడ్ల బ్రిడ్జికి రూ.4కోట్లు వెచ్చించిన అధికారులు, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం మరో రూ.కోటి వ్యయం చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మించాలని అంచనాల్లోనే ఉంటుందని ఇతర శాఖల అధికారులు అంటున్నారు. అప్రోచ్‌రోడ్డు పేరిట మరో రూ.కోటి వ్యయం చేసినట్లు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ, బ్రిడ్జి అంచనాల్లో ఉందా...లేదా అన్న విషయాలు తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఐటీడీఏ పరిధిలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో పలువు రు కోరారు. కానీ.. ఇప్పటివరకు ఎవరూ స్పం దించిన దాఖలాలు లేవు. దీంతోపాటు సదరు కాంట్రాక్టర్ రివిట్‌మెంట్ పనులను అసంపూర్తిగా వదిలేసినా... ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు మొత్తం చెల్లించడంపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది..