సామర్థ్యం పెంచేందుకే రీ డిజైనింగ్ | Increase the ability to re-design | Sakshi
Sakshi News home page

సామర్థ్యం పెంచేందుకే రీ డిజైనింగ్

Published Tue, Apr 12 2016 5:02 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

సామర్థ్యం పెంచేందుకే రీ డిజైనింగ్

సామర్థ్యం పెంచేందుకే రీ డిజైనింగ్

♦ ఉమ్మడి రాష్ట్రంలో కుట్రపూరితంగా తప్పులు
♦ కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే నైతిక హక్కులేదు
♦ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
 
 తిమ్మాపూర్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకే ప్రాజెక్టులు, రిజర్వాయర్ల రీ డిజైనింగ్ చేయాల్సి వస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ రిజర్వాయర్ దిగువన 146 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వరకు జరుగుతున్న కాకతీయ కాలువ పునరుద్ధరణ పనులను మంత్రి ఈటల రాజేందర్, సాంస్క­ృతిక సారథి చైర్మన్ రసమరుు బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తక్కువ భూమిని సేకరిస్తూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేలా ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేస్తే టీపీపీసీ నేతలు అసెంబ్లీలో మాట్ల్లాడకుండా పారిపోయి బయట విమర్శలు చేస్తున్నారని, వారికి మాట్లాడే నైతికత లేదని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రీ డిజైనింగ్‌పై, రైతు ఆత్మహత్యలపై మాట్లాడడం సిగ్గు చేటుగా ఉందని, ఆయన మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నీళ్లురాని చోట ప్రాజెక్టులను కాంగ్రెస్‌వారు కడితే, వాటి ద్వారా నీళ్లు వచ్చేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

దేవాదుల, ప్రాణహిత, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో తక్కువ నీటి సామర్థ్యంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలు సాధ్యమవుతాయా? అంటూ ప్రశ్నించారు. అం దుకే ప్రాణహిత-చేవెళ్లపై సీడబ్ల్యుసీ మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. వీటి దృష్ట్యా రెండో పంటకు నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకే తాము ప్రాణహితలో 180 టీఎంసీల నీరు ఉండేలా, కల్వకుర్తిలో 20టీఎంసీలు ఉండేలా రీ డిజైనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 1.6టీఎంసీల నుంచి 8.24టీఎంసీలకు పెంచుతున్నట్లు చెప్పారు. పీఎంకేఎస్‌వైలో వరదకాల్వను చేర్పించామన్నారు. ఏపీలో, మహారాష్ట్రలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, బ్యారేజీ లేకుండా కాలువలు ఎలా తవ్వారం టూ ప్రశ్నించారు.

అందుకే మహారాష్ట్రతో తమ్మిడిహెట్టిని 148 మీటర్ల ఎత్తుకు, 44 టీఎంసీల నీటిని తీసుకునేందుకు  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగతా నీటి కోసం ప్రత్యామ్నాయంగా గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలు కడుతున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుట్రపూరితంగా తప్పులు జరిగాయని దుయ్యబట్టా రు. ఏనాడూ కాకతీయ కాలువ నుంచి 8 వేల క్యూసెక్కులు వెళ్లలేదని, రానున్న ఖరీఫ్‌లోగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే లక్ష్యంతోనే పునరుద్ధరణ చేపడుతున్నామని తెలిపారు. దీంతో స్టేజ్ 2 పరిధిలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించవచ్చన్నారు. కాలువ పునరుద్ధరణ పూర్తికి మే 30 గడువు కాగా, మే 20 నాటికే పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement