ఢిల్లీలో జ్యోతి వెలిగిస్తున్న ప్రధాని మోదీ, ప్రగతిభవన్‌లో కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం తెలుపుతున్న సీఎం కేసీఆర్, తాడేపల్లిలో క్యాండిల్ వెలిగించి సంఘీభావం తెలుపుతున్న సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్: ఆదివారం రాత్రి 9గం టలు.. రాష్ట్రంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి.. ఉన్నట్టుండి ప్రజలంతా ఇళ్లలోని లైట్లు ఆపేశారు. చీకటి తెరలు అలా వాలా యో లేదో.. వాటిని చీల్చుకుంటూ కాంతులు ప్రసరించాయి. కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించాయి. ‘గో కరోనా.. గో. మా దేశం విడిచి వెళ్లు’ అంటూ కోట్లాది గొంతులు దీపాల వెలుగుల సాక్షిగా నినదించాయి.
వెలుగొందిన ఐక్యతాస్ఫూర్తి..
కరోనా మహమ్మారిని దేశవాసులమంతా మూకుమ్మడిగా ఎదుర్కొంటామనే ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పేందుకు, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి తెలంగాణ అద్భుతంగా స్పందించింది. గత నెల 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమానికి దీటుగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించే కార్యక్రమం జరి గింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ తమ నివాసాలైన రాజ్‌భవన్, ప్రగతిభవన్‌లలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీరితో పాటు కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజలంతా దీపాలు వెలి గించడం ద్వారా కరోనా రక్కసిపై యుద్ధం చేస్తామని ప్రతినబూనారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, చిన్నారులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ఐక్యతా స్ఫూర్తిని చాటుతూ తమ నివాసాల వద్ద దీపాలు వెలిగించగా, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. వ్యాపార, వాణిజ్య వర్గాలు, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమస్ఫూర్తిని చాటారు.
కరోనా వైరస్‌పై అలుపెరగని పోరుకు సంఘీభావంగా ప్రధాని పిలుపు మేరకు ఆదివారం రాత్రి లైట్లను ఆపేసి దీపాలను వెలిగించిన బెంగళూరు వాసులు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
అటు ఏపీలోనూ వాడవాడలా ప్రజలు ఆదివా రం రాత్రి దీప ప్రజ్వలన చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ని క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించి కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావాన్ని తెలి పారు. ఇంకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధి కారులు, సిబ్బంది దీపాలు వెలిగించారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కూడా రాజ్‌భవన్‌లో దీప ప్రజ్వలన చేశారు.
స్పీకర్, మంత్రుల సంఘీభావం
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన అధికారిక నివాసంలోనూ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌ డ్, వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రుల నివాస సముదాయంలోని తమ అధికారిక నివాసంలో దీపా లు వెలిగించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కొండాపూర్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించి కరోనా చీకటిపై సమరభేరి మోగించారు.
జ్యోతి వెలిగించిన సీఎం కేసీఆర్
కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా సీఎం కే.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధాని నరేంద్ర మోది పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిముషాల పాటు కొవ్వొత్తి పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య ఇతర కుటుంబసభ్యులతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంతకుమారి, అడ్వకేట్ జనరల్ పీఎస్ ప్రసాద్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాతబస్తీలోని గాంధీనగర్‌లో..
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment