ఇందిరమ్మ వరద కాల్వ వ్యయం రెట్టింపు!
► దేవాదులలోని 2లక్షల ఎకరాల ఆయకట్టు చేర్చడంతో పెరిగిన వ్యయం
► అంచనా రూ.4,729కోట్ల నుంచి 9,886 కోట్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ఇంది రమ్మ వరద ప్రవాహ కాల్వ (ఎఫ్‌ఎఫ్‌సీ) వ్యయం రెట్టింపు కానుంది. ప్రాజెక్టు ప్రస్తుత అంచనా రూ.4,729 కోట్లు ఉండగా, రీ ఇంజనీరింగ్‌లో భాగంగా జరిగిన మార్పు లతో దాని వ్యయం రూ.9,886 కోట్లకు చేరనుంది. సవరించిన అంచనాలకు ఆమో దం తెలపాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వర లో దీనికి ఆమోదం లభించనుంది.
1,331 కోట్లతో ఆరంభమై 9 వేల కోట్లకు
ఎస్సారెస్పీ దిగువ తీరం నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.20 లక్షల ఎకరాలకు నీటినిచ్చేలా ఎఫ్‌ఎఫ్‌సీని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేవాదుల పరిధిలోని ఆయ కట్టును ఎఫ్‌ఎఫ్‌సీలోకి తెస్తూ కీలక నిర్ణయం జరిగింది. గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.18 టీఎంసీల నీటిని దేవాదుల ప్రాజెక్టుకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజె క్టును చేపట్టారు. ఇక్కడ వరద కేవలం 120 రోజులే ఉంటుందని, 27టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు.
ఈ నీటితో ముందుగా నిర్ణయించిన 6.21లక్షల ఎకరా లకు సాగు నీరందించడం కుదరదని తేలింది. సుమారు 2లక్షల ఎకరాలకు నీటి కొరత ఏర్పడుతున్న దష్ట్యా, ప్రత్యామ్నాయంగా ఈ ఆయకట్టుకు వరద కాల్వల ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు కొత్తగా వరద కాల్వ ద్వారా నీటిని అందించా లంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్ నిర్మాణంతో పాటు 48 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ తవ్వాలని అధికారులు ప్రతిపాదిం చారు.
దీంతో పాటే మిడ్‌మానేరు రిజర్వా యర్ కెనాల్ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,600 క్యూసె క్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. దీనికి తోడు గౌరవెల్లి రిజర్యాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8,23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి పెంచారు. దీనికి తోడు మిడ్‌మానేరు, ఇతర రిజర్వాయర్ల కింద భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ఖర్చు సైతం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుత అంచనా రూ.9,886కోట్లకు చేరింది.