సమగ్ర సర్వేలో అనూహ్య ఫలితాలు
హైదరాబాద్: సచివాలయంలో సర్వేపై జిల్లా కలెక్టర్లతో ముగిసిన ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. తెలంగాణ సమగ్ర సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. 100 కుటుంబాలకు సర్వే అంచనా ఉండగా.. 106 కుటుంబాల శాతానికి సమగ్ర సర్వే జరిగిందని తేలింది. తెలంగాణ వ్యాప్తంగా 1.5 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఇంకా 2.8 శాతం సమగ్ర సర్వే మిగిలివుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 2 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సివుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 19.43 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. ప్రభుత్వ అంచనాల కంటే దాదాపు అన్ని జిల్లాల్లో కుటుంబాల సర్వే నమోదు శాతం పెరగడం విశేషం.