ఇంటర్‌ బోర్టు కొత్త నిర్ణయం | Inter Board Decision Over Reverification And Recounting Process | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్టు కొత్త నిర్ణయం

Published Wed, May 1 2019 6:20 PM | Last Updated on Wed, May 1 2019 6:29 PM

Inter Board Decision Over Reverification And Recounting Process - Sakshi

కాగా గత సోమవారం ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టు విచారణ జరపగా...

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ బోర్టు కొత్త నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల ప్రక్రియలో గ్లోబరినాతో పాటు మరో స్వతంత్ర కంప్యూటర్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపింది. మరో స్వతంత్ర్య కంప్యూటర్ సంస్థ ఎంపిక బాధ్యతలు టీఎస్‌టీఎస్‌కు అప్పగించినట్లు వెల్లడించింది. టీఎస్‌టీఎస్‌ మరో కంప్యూటర్‌ ఎజెన్సీని ఎంపిక చేసిన వెంటనే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది.

కాగా గత సోమవారం ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టు విచారణ జరపగా.. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement