వరంగల్ క్రైం : వరంగల్‌లో మహిళల దృష్టి మరల్చి పలుదోపిడీలు చేసిన ఇరానీగ్యాంగ్ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. రెండు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్ సభ్యుల్లోని ముగ్గురిని వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయడంతో వారు చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారుు. మహారాష్ర్ట భీమండి ప్రాంతానికి ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి వీరిపై మొత్తం 18 కేసులు ఉన్నాయి. వరంగల్ నగరంతోపాటు కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, కర్నూలు తదితర జిల్లాల్లో వీరిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి. వరంగల్ నగరంలో మూడు కేసుల్లో వీరిని నిందితులుగా గుర్తించారు.
ఒంటరి మహిళలే వారి టార్గెట్..
వరంగల్ నగరంలో కొన్నేళ్లుగా దృష్టి మళ్లింపు కేసులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల పేరుతో నమ్మించి.. వారి ఆభరణాలు కాజేయడం వీరి పని. ఒంటరిగా ఆభరణాలతో వెళుతున్న మహిళలను ఈ గ్యాంగ్ టార్గెట్ చే స్తుంది. తాము పోలీసులమని.. ముందు చెకింగ్ జరుగుతుందని లేదా హత్య జరిగిందని చెబుతారు. తర్వాత మెడలోని ఆభరణాలు తీసి సంచిలో వేసుకొండి అని హడావుడి చేస్తారు. సదరు మహిళ భయభ్రాంతులకు లోనైన తర్వాత ముందు మా సార్ ఉన్నాడంటూ అక్కడికి తీసుకువెళ్తారు. అప్పటికే అక్కడ ఉండే మరో వ్యక్తి ముందు గొడవ జరుగుతుందని, మెడలోని బంగారు నగలు తీసి బ్యాగులో వేసుకోమని సలహా ఇస్తాడు. వెంటనే మొదటి వ్యక్తి ఆ మహిళ బంగారు ఆభరణాలు తీయగానే వాటిని ఒక సంచిలో వేసి ఆమెకు చూపెడతాడు.
తన వద్ద రాళ్లు నింపిన అచ్చు అలాంటి సంచినే ఆమెకు ఇచ్చి బ్యాగులో పెట్టుకోవాలని సూచిస్తారు. తీరా బాధితురాలు ఇంటికి వెళ్లి చూసుకుంటే అందులో రాళ్లు ఉంటాయి. ఇలాంటి కేసులు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో అనేకం జరిగాయి. కొద్ది నెలల క్రితం హన్మకొండ అలంకార్ సెంటర్, వరంగల్ మర్రి వెంకటయ్య కాలనీ, హన్మకొండ సమయ్య కాలనీలో జరిగాయి. కొన్నేళ్లుగా నగరంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే దృష్టి మరలింపు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
పట్టుబడింది ఇలా..
అత్యంత చాకచక్యంగా వ్యవహరించే వీరిని పోలీసు లు పట్టుకోవడం సవాల్‌గా మారింది. ఓ మహిళ దృష్టిని మరల్చి దోపిడీకి పాల్పడ్డ ఈ ముఠా సభ్యులు బైక్‌లు మారుస్తూ పరారై చివరకు ఒక ప్రదేశంలో కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ సెంటర్‌లో జరిగిన ఈ తతంగం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డరుుంది. ఆ తర్వాత సెంటర్లలోని సీసీ కెమెరాల పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన అక్కడి పోలీసు లు వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. మిగతా నలుగురిని కూడా త్వరలోనే పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పోలీసులకు చిక్కిన ఇరానీ గ్యాంగ్
Published Sat, Jul 5 2014 3:35 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement