నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి | IT Minister KTR Counter fries on AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి

Published Sat, Jun 20 2015 2:41 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి - Sakshi

నిప్పో.. కందిపప్పో బాబే తేల్చుకోవాలి

తప్పు చేయకపోతే భయమెందుకు?: కేటీఆర్
మెదక్ టౌన్: ఓటుకు కోట్లు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పో.. కందిపప్పో ఆయనే తేల్చుకోవాలని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట తారకరామారావు అన్నారు. బాబు తప్పుచేయకపోతే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ను సస్పెండ్ చేసిన బాబుకు ..

డబ్బులతో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ఎందుకు కనికరం చూపుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నిప్పులాగానో.. కడిగిన ముత్యంలాగానో ఓటుకు కోట్లు కేసులో ఏసీబీకి సహకరించాలన్నారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement