
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ టీడీపీ నేత, ఉప్పల్ అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు చెందిన కంపెనీల్లో గురువారం ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహించారు.
వీరేందర్ గౌడ్‌కు చెందిన డీఎస్ఏ బిల్డర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తదితర సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శాంతా శ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment