రైల్వే స్టేషన్లో వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్న రిలయన్స్ జియో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో రిలయన్స్ జియో ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా 'జియో స్వచ్ఛ రైల్ అభియాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 900 రైల్వే స్టేషన్లలో సుమారు 25,000 మందికి పైగా జియో ఉద్యోగులు వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. తెలంగాణలో సుమారు 27 రైల్వే స్టేషన్లలో దాదాపు 1200 మందికి పైగా జియో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేకరించిన బాటిల్స్, ఆహార ప్యాకింగ్ కవర్లు, స్ట్రాలు, ప్లాస్టిక్ స్పూన్లు, క్యారీ బ్యాగ్లు వంటి వ్యర్ధ పాస్టిక్ ను జియో, సుశిక్షుతులైన ఏజెన్సీల సహాయంతో పర్యావరణహితంగా రీసైకిల్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment