జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
నల్లగొండ అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా తగు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ వారు ఈ నెల 16న జారీ చేసిన 7910 ప్రొసిడింగ్‌లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారని వివరించారు. రంగారెడ్డి, మహాబూబ్‌నగర్ జిల్లాల్లో నూరుశాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. డీఈఓ ఎస్.విశ్వనాథరావు స్పంది స్తూ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జర్నలిస్టులు, మధుసూదన్, ఆంజ నేయులు, ఫహీమొద్దీన్, శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, యాదగిరి, సుధాకర్, ఉన్నారు.