సాక్షి,సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఆరోగ్యబీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సోమవారం రాష్ర్టవ్యాప్తంగా ‘సావధాన దినం’గా పాటించింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెంట నే స్పందించి ఆరోగ్య బీమా పథకానికి సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరుతూ సమాచారాశాఖ, జిల్లా కలెక్టర్ల ద్వారా వినతి పత్రాలను అందజేసింది. టీయూడబ్ల్యూజే, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో సమాచార శాఖ డెరైక్టర్ సుభాష్‌గౌడ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సమాచారశాఖ కార్యాలయం వరకు జరిగిన భారీ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐజే యూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకుడు, విశాలాంధ్ర సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ నాయకులు ఎంఎ మాజిద్, కె.సత్యనారాయణ,ై వె.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, హెచ్‌యూజే నాయకులు వి.యాదగిరి, టి.కోటిరెడ్డి పాల్గొన్నారు.
హెల్త్‌స్కీమ్ అమలు చేయాలి : దేవులపల్లి అమర్
విజయనగర్‌కాలనీ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి, టీజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్‌స్కీమ్ అమలు చేయాలన్నారు. జర్నలిస్టుల వాటా సుమారు కోటి రూపాయలు ఏడాది కాలం గా ప్రభుత్వ ఖజానాలో ఉందన్నారు.
జర్నలిస్టులకు ‘ఆరోగ్య బీమా’ అమలు చేయాలి
Published Tue, Aug 12 2014 3:24 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement