'కాంగ్రెస్ సన్నాసులతో అభివృద్ధి శూన్యం'
నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డిలపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. బుధవారం నల్గొండ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ ఈ సందర్బంగా సదరు నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు.
అలాగే కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయిన జైపాల్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా కూడా చేయకుండా పదవే పరమావధి అన్నట్లు కేంద్ర పదవిని అంటిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు పదవులను అనుభవించడం తప్ప ఏమి చేతకాదని ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ సన్యాసులు తెలంగాణను అభివృద్ధి చేయలేరని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు.