ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా
న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచారు. అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేసిన టి. రాజయ్య అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో కడియం శ్రీహరికి మంత్రి పదవికి దక్కింది. విద్యాశాఖ నిర్వహిస్తున్న ఆయన ఉప ముఖ్యమంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.