బంజారాహిల్స్: విద్య, వైద్య రంగాల్లో భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇక్కడ తమ పర్యటన దోహదపడుతుందని అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అల్షనోవ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరంలో పర్యటించిన కజకిస్తాన్ బృందం సభ్యులు మంగళవారం వైద్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్‌కు చెందిన మూడు వేలమంది విద్యార్థులు తమ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, వారిలో 600 మంది తెలంగాణకు చెందినవారన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కజకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించి వచ్చే ఎంబీబీఎస్ అభ్యర్థులకు ఎంసీఏ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా శిక్షణా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్టనర్ హసన్, భారత్‌లో యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ బి.దివ్య, బీవీకే రాజ్, కె.రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment