దక్షిణాఫ్రికాలో కాజీపేట రైల్వే ఉద్యోగి మృతి | Kajipeta Railway Employee death in South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో కాజీపేట రైల్వే ఉద్యోగి మృతి

Published Sat, Aug 6 2016 4:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

దక్షిణాఫ్రికాలో కాజీపేట రైల్వే ఉద్యోగి మృతి

దక్షిణాఫ్రికాలో కాజీపేట రైల్వే ఉద్యోగి మృతి

కాజీపేట రూరల్: వరంగల్ జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి వీఆర్ జ్ఞానేశ్వర్(58) దక్షిణాఫ్రికాలో మృతి చెందారు. భారత కాలమాన ప్రకారం 3వ తేదీ తెల్లవారు జామున ఆయన అనారోగ్యంతో మృతి చెంది నట్లు శుక్రవారం డీజిల్ లోకోషెడ్ అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. వరంగల్ జిల్లా డోర్నకల్‌కు చెం దిన జ్ఞానేశ్వర్ కాజీపేట డీజిల్ లోకోషెడ్‌లో రైల్వే సీని యర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. జ్ఞానేశ్వర్‌తోపాటు మరో ఇద్దరు డిప్యుటేషన్‌పై 2015 సెప్టెంబర్ 21న దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్‌కు వెళ్లారు.

వీరు అక్కడి నుంచి ఈ నెల 21న తిరిగి రావాల్సి ఉంది.  అతడి మృతదేహాన్ని శుక్రవారం అర్ధరాత్రి  మొజాంబిక్ నుంచి విమానంలో దుబాయి వరకు.. అక్కడి నుంచి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయూనికి తీసుకొస్తారని, అక్కడి నుంచి హన్మకొండకు తీసుకొస్తామని రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు. ఐదేళ్ల క్రితం జ్ఞానేశ్వర్ డీజిల్ లోకోషెడ్ నుంచి మలేసియాకు డిప్యుటేషన్‌పై వెళ్లి వచ్చారు. కొంతకాలం క్రితం అతడి పెద్ద కుమారుడు మృతి చెందగా.. అదే మనోవేదనతో భార్య కూడా మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement